మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ సోషల్ మీడియాకున్న పవరేంటో తెలుసుకుంది.అందుకే గతంలో మాదిరిగా కాకుండా ఫేస్ బుక్ లకు ,ట్విట్టర్ అకౌంట్ లకు ఇపుడు చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తోంది.
దీంతో ఆంటీగారి సోషల్ మీడియా ఎంట్రీ దాదాపు ఖరారైనట్లు కనిపిస్తుంది.ఇదంతా త్వరలో రాబోతోన్న జజ్ బా చిత్రం కోసం వేస్తోన్న ఎత్తులని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
జజ్ బా చిత్రం రిలీజ్ కు కేవలం కొన్ని గంటల ముందు అమ్మడు తన ట్విట్టర్ అకౌంట్ ను లాంచ్ చేస్తోంది.దాన్నించి తన మామ అమితాబ్ మాదిరిగా తానంటూ ఒక తారనున్నాననే సందేశం ప్రేక్షకులకు ఇవ్వబోతోంది.
అయితే ఇక్కడ ఆసక్తిగా గమనించాల్సిన విషయం ఒకటుంది.అదేంటో కాదు….ఇంతకాలం ట్విట్టర్ లో మిలియన్ ఫాలోవర్స్ ను తెచ్చుకోవడానికి సంవత్సరాలు టైమ్ తీసుకున్న భామలందరికీ చెక్ పెడుతూ…. ఐష్ కేవలం ఒక్క రోజులోనే మిగతా తారంతా సాధించిన ఫీట్ ను సాధిస్తోందంటూ బాలీవుడ్ మీడియా చెబుతోంది.ఐష్ కున్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు కాబట్టి…అక్టోబర్ 9న సినిమాతో పాటు తన ట్విట్టర్ అకౌంట్ కూడా సూపర్ సక్సెస్ అవ్వొచ్చు.
