Friday, April 26, 2024
- Advertisement -

కిలాడి మరో మెసేజ్ అందించేస్తున్నాడు

- Advertisement -

కిలాడి అక్షయ్ కుమార్ ఒక సినిమా చేస్తున్నాడంటేనే అందుల్లో ఏదో సమ్ థింగ్ ఉందనే విషయం అందరికీ అర్ధమైపోతుంది.గత కొంతకాలంగా అక్కీ ఎంచుకుంటోన్న సినిమాలన్నీ సామాజిక కోణంలో చూసే ఎంచుకుంటోన్న కథలే. ఇంతకాలం హీరోయిజం చూపించాం.ఇక నుంచి వాస్తవ దృశ్యాలను చూపించి జనాలను మేల్కొలుపుదాం అనే ఆలోచనకు అక్షయ్ వచ్చేశాడు. `టాయ్‌లెట్‌-ఏక్ ప్రేమ్‌క‌థ‌` కూడా అలా వచ్చిందే. ప‌చ్చద‌నం, ప‌రిస‌రాల శుభ్రత‌పై స్వఛ్ భార‌త్ కాన్సెప్టును ఈ చిత్రంలో ఎలివేట్ చేశారు కిలాడీ.ఇపుడు తాజాగా `పాడ్‌మాన్` ట్రెండ్ సెట్టింగ్ కాబోతోందని రిలీజైన ట్రైల‌ర్ చూశాక అర్ధమవుతుంది.

కథా పరంగా చూస్తే.. ఉత్తరాదికి చెందిన ఓ గ్రామీణ రైతు సాధించిన అసాధార‌ణ విజ‌యం ఏమిటనేది తెర‌పైనే చూడాలి. ఈ సినిమా ట్రైల‌ర్ అద్వితీయంగా ఉంది. విలేజ్‌లో అంత‌గా ఆంగ్ల భాషా ప్రావీణ్యం లేక‌పోయినా యువ‌కుడైన ఆ రైతు చేసిన ఓ ప్రయోగం ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యింది? పాడ్ మేన్ .. బ్యాడ్ మేన్ అయిన అత‌డు తాను అనుకున్న ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు ఏం చేశాడు? అన్నది ఆస‌క్తిక‌రం. అమెరికాలో అయితే సూప‌ర్‌మేన్‌, బ్యాట్‌మేన్‌లు ఉంటారు కానీ, ఇండియాలో ఇలాంటి పాడ్‌మ్యాన్‌లే ఉంటారు అంటూ ట్రైల‌ర్‌లోనే చెప్పడం ఆస‌క్తి రేకెత్తించింది.

పాడ్ మేన్‌ అంటే ప‌త్తి పండించేవాడు అని అర్థం.. కానీ ఈ టైటిల్‌ని ప‌ద్మాన్ అని కూడా చ‌దువుతున్నారు. పాడ్ పండించే మేన్ అని ఈ ట్రైల‌ర్ చూశాక ఎవ్వరికైనా అర్థమవుతుంది. ఆడాళ్లకు సురక్షిత‌మైన ప్యాడ్‌ని క‌నిపెట్టిన భ‌ర్తను ఏమాత్రం మెచ్చుకోని పెళ్లాంగా రాధిక ఆప్టే క‌నిపించింది. అయితే అత‌డి ప్రయోగాన్ని ప్రోత్సహించే కిలేడీగా సోన‌మ్ క‌పూర్ ఎంట్రీ ఆక‌ట్టుకుంటుంది. ప‌త్తి రైతుల‌కే కాదు, అంద‌రికీ `పాడ్ మాన్‌` సందేశం క‌నెక్ట్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడో ఆసక్తిక‌ర విష‌యం ఏమంటే అత్యంత త‌క్కువ ఖ‌ర్చుతో శానిట‌రీ ప్యాడ్ త‌యారు చేసే మెషీన్‌ని క‌నిపెట్టిన అరుణాచ‌లం మురునంతం అనే రైతు క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. జ‌న‌వ‌రి 26న సినిమా రిలీజ‌వుతోంది. ట్రైల‌ర్‌తోనే తొలి విజ‌యం అందుకున్నాడు. మ‌లివిజ‌యం కోసం సందేహాలు అక్కర్లేదిక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -