Thursday, April 25, 2024
- Advertisement -

చిరు, పవన్, బాలకృష్ణ, చరణ్‌ల మేనియా నుంచి బయటకు రండి…… రియల్ సూపర్ స్టార్‌ని చూడండి

- Advertisement -

ఎంత సేపూ తొడలు కొట్టుకోవడం, సింహం, పులి, మగతనం అంటూ వీధులమ్మట బేవార్స్‌గా తిరిగే బాపతు జనాల్లాగా డైలాగులు చె్ప్పడం…… అరుపులు, కేకలు, అమ్మాయిలతో రొమాన్స్…… ఇవి లేకుండా మన స్టార్ హీరోలు సినిమాలు చేయగలరా? వీళ్ళ జన్మకు అది సాధ్యమయ్యేదేనా? ఎప్పిటికీ సాధ్యం కాదు. అసలు వీళ్ళకు అంత ధైర్యం ఎక్కడేడ్చింది. తెరపైన హీరోయిజం చూపించుకుంటూ బ్రతికేయాల్సిందే తప్ప….. తెరవెనకాల ఈ హీరోల కంటే వాళ్ళ అభిమానులే చాలా ధైర్యం చేస్తుంటారు. ఈ హీరోల గొప్పదనాన్ని ఇతర హీరోల అభిమానుల చేత ఒప్పించడానికి ఆయా హీరోల అభిమానులు చూపించే ధైర్యం, తెగువ కూడా మన హీరోలు రియల్ లైఫ్‌లో చూపించలేరు. మూర్ఖత్వమే అయినప్పటికీ ఆయా హీరోల మూఢాభిమానులు ఆ విషయంలో చాలానే ఫైట్ చేస్తూ ఉంటారు. హీరోలు మాత్రం సినీకళామతల్లి, అభిమానులంటే మాకు ప్రాణం అంటూ సోది డైలాగులు చెప్తూ కోటానుకోట్ల డబ్బుల కోసం సినిమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కనువిప్పు కలిగించే ఒక రియల్ హీరో…… ఇద్దరు ముగ్గురు విలన్లు….. వాళ్ళతో తొడగొట్టే డైలాగులు….. ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాన్స్….ఆరు పాటలు కాదు సినిమా అంటే….. ఆ సినీ కళామతల్లిని గౌరవించడం…. ఆ కళకు గౌరవం పెంచేలా చేయడం ఎలాగో అక్షయ్ కుమార్ నిరూపిస్తున్నాడు. ఇంతకుముందు స్వఛ్ భారత్ కాన్సెప్ట్‌పై ఒక సినిమాలో యాక్ట్ చేసి……… ఆ సినిమాను హిట్ చేసిన అక్షయ్ ఈ సారి లేడీస్ ప్రాబ్లంని ఇష్యూగా తీసుకుని ‘ప్యాడ్‌మేన్’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు.

చాలా చాలా సీరియస్ విషయం…… అంతకుమించి సెన్సిటివ్ విషయం……. తరతరాలుగా మన ఇళ్ళలో ఉన్న అమ్మ, అక్క, చెల్లెల్లు సిగ్గుతో చచ్చిపోతూ ఎన్నో రకాల వ్యాధులు కొనితెచ్చుకున్నప్పటికీ మనమెవరం కనీస స్థాయిలో కూడా ఆలోచించకుండా వాళ్ళను బాధితులుగానే ఉండిపోయేలా చేసిన బాధాకరమైన అంశం. అయితే చాలా విషయాల్లో ఇప్పుడు ధైర్యంగా ముందడుగేస్తున్న మహిళలు ఇప్పుడు ఆ సమస్య విషయంలో కూడా వాళ్ళకు వాళ్ళే పరిష్కారాలు కనుక్కుంటూ ఉన్నారు. అయితే ఇంకా విలేజ్‌ల స్థాయికి, సమాజపు మూలాల్లోకి ఆ చైతన్యం చేరలేదు. అందుకే మహిళలు ఎవ్వరూ కూడా ఆ సమస్యతో బాధపడకూడదు, సిగ్గుపడకూడదు, వ్యాధులు కొని తెచ్చుకోకూడదు అన్న సంకల్పంతో అక్షయ్ కుమార్ ‘ప్యాడ్ మేన్’ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అంత పెద్ద సీరియస్ విషయాన్ని కూడా ఆసక్తి కలిగించేలా….సినిమాను అందరికీ చేరువ చేసేలా ఎంటర్టైన్‌మెంట్ కూడా ఉండేలా జాగ్రత్తపడుతూ….అద్భుతమైన విజ్ఙానాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాడు అక్షయ్ కుమార్. బాల్కీ రూపొందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ చాలా చాలా చాలా బాగుంది. ఈ సినిమా కోసం మేకర్స్ పడిన కష్టం……. ప్యాడ్‌మేన్ మరుగనాథం పాత్రలో అక్షయ్ లీనమయి నటించిన విధానం……అతని డ్రెస్సింగ్ అంతా కూడా వహ్వా అనిపిస్తుంది. ఈ కథ ఆ రియల్ ప్యాడ్‌మేన్ మురుగనాథం జీవితం నుంచి తీసుకున్నదే. స్త్రీలు శక్తివంతంగా ఉంటేనే భారతదేశం కూడా శక్తివంతంగా ఉంటుంది అని చెప్పడం అయితే ఈ ట్రైలర్‌కే హైలైట్. ఇలాంటి గొప్ప సినిమా కోసం ముందుకొచ్చిన అమితాబ్ బచ్చన్ తన వాయిస్‌ని అందించడం ఇంకా గొప్ప విషయం.

అక్షయ్ కుమార్‌తో పోల్చి మన హీరోలను విమర్శించడం కొంతమందికి నచ్చకపోవచ్చేమో కానీ భజనకు బాగా అలవాటు పడ్డ మన హీరోలకు కనీసం కొన్ని విమర్శలయినా వినిపిస్తే కాస్త ఆ తొడగొట్టుడు సినిమాలు, కూతుళ్ళు, మనవరాళ్ళు ఉన్నప్పటికీ టీనేజ్ అమ్మాయిలతో రొమాన్స్ చేయాలని కోరుకోవడాలు, రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు వదిలేసి కాస్త ‘ప్యాడ్‌మేన్’ లాంటి విషయం ఉన్న సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాల్లో యాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారన్న ఆశ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -