‘ఓ మై గాడ్‌ డాడీ..’ అంటున్న బన్నీ పిల్లలు

- Advertisement -

‘అల వైకుంఠపురంలో’ మూవీ ప్రమోషన్‌తో సోషల్‌ మీడియాతో స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ తెగ సందడి చేసేస్తున్నాడు. ఈ సినిమాలోని ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు యూట్యూబ్‌లో హల్‌హల్‌ చేస్తున్నాయి. రి

కార్డు వ్యూస్‌తో బన్నీ పాటలు దూసుకుపోతున్నాయి. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 14న మరో సాంగ్‌ టీజర్‌ విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ ప్రమోలో కనిపించిన స్పెషల్‌ గెస్ట్‌లను చూసి బన్నీ ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ అయ్యారు.

- Advertisement -

బన్నీ కుమారుడు అయాన్‌, కూతురు అర్హ ఈ టీజర్‌లో క్యూట్‌గా సందడి చేశారు. ‘ఓ మై గాడ్‌ డాడీ..’ అంటూ సాగే పాటలో అయాన్‌ అచ్చం తండ్రిలానే స్టెప్పులేసి వావ్‌ అనిపించాడు. అర్హ కూడా అన్నకు దీటుగా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది. వీరిద్దరి ఫెర్మారెన్స్‌ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ‘ఓమైగాడ్‌’ సాంగ్‌ టీజర్‌ ఒక్కరోజులోనే 20 లక్షలకు పైగా వ్యూస్‌ సాధించి రికార్డులను తిరగరాసే దిశగా దూసుకపోతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’మూవీ సంక్రాంతికి విడుదలకానుంది.

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -