Saturday, April 27, 2024
- Advertisement -

ఏపిలో వకీల్ సాబ్ కి హైకోర్టు షాక్

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్. వెండితెరపైనే కాదు రాజకీయాల్లో కూడా తనదైన దూకుడు ప్రదర్శిస్తున్న పవన్ కళ్యాన్ గత మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రిమేక్ గా తెలుగు నేటివిటీకి తగ్గట్టు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ తెరకెక్కించారు. ఈ చిత్రం ఏప్రిల్ 9 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లు రాబడుతుంది. ఇదిలా ఉంటే.. వకీల్ సాబ్ చిత్రానికి ఏపీలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.

సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా, టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు లేకపోవడంతో ఓపెనింగ్స్ పై ప్రభావం చూపనుంది. దాంతో వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ మూడ్రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు కొట్టివేసింది. ఏపీలో వకీల్ సాబ్ సినిమా టికెట్ రేట్లను పెంచొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇది రాజకీయ కోణంలో చూస్తున్నారని.. వైసీపీ పై గరం అవుతున్నారు బీజేపీ, జనసేన పార్టీ నేతలు.

అత్యంత దారుణం అంటూ చీల్చి చండాడీన బండి..!

మమ్మల్ని గెలిపిస్తే బంపర్ ఆఫర్ అంటూ.. కిషన్ రెడ్డి ప్రకటన..!

హాట్ అందాలతో రెచ్చగొడుతున్న జాన్వీ బ్యూటీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -