Friday, April 26, 2024
- Advertisement -

వ్యాక్సిన్ తీసుకున్న సెలబ్రిటీలు ఓవరాక్షన్ ఆపండి.. హీరోయిన్ సెటైర్!

- Advertisement -

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికి పోతున్నాయి. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న భారత దేశంలో కరోనా మొదటి దశ కంటే రెండో దశ ప్రజలపై చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది.ఇలాంటి తరుణంలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే, జనవరిలో నెలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే.

మొదటిదశలో 60 సంవత్సరాలు పైబడిన వారికి, రెండో దశలో 45 సంవత్సరాలు పైబడిన వారికి , ప్రస్తుతం మూడో దశ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ పై ప్రజలలో ఏర్పడిన భయాందోళనలు తొలగించడానికి ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న చాలామంది సెలబ్రిటీలు ప్రజలకు వ్యాక్సినేషన్ పై తమకు తోచిన విధంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Also read:ఎన్టీఆర్ కు కరోనా రావడానికి కారణం వాళ్లేనా?

అందులో భాగంగా చాలామంది సెలబ్రిటీలు వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటోలు, వీడియోలను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటున్నారు. దీనిపై బాలీవుడ్ టెలివిజన్ నటి అశా నేగీ ఈ విధంగా స్పందించారు. వ్యాక్సినేషన్ వీడియో అప్‌లోడ్ చేస్తున్న యాక్టర్లు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే. అవగాహన కల్పించడం మంచిదే కానీ దయచేసి ఓవర్‌ యాక్టింగ్ చేయకండి యార్.. చాలా చిరాకుగా ఉంది’ అంటూ ఆమె పేర్కొంది. దీంతో పాటు ఆమె మరొక సెటైర్ కూడా వేసింది. మీరు వ్యాక్సిన్ తీసుకున్న చోటికి వీడియోగ్రాఫర్‌ని మీరే తీసుకువెళ్తారా లేక ఆస్పత్రి వాళ్లే ఏర్పాటు చేస్తున్నారా అని విమర్శనాత్మకంగా ట్వీట్ చేయడంతో దీనిపై నెటిజెన్స్ విపరీతమైన కామెంట్స్ గుప్పిస్తున్నారు..

Also read:లైవ్ లో ఆ విషయాలను చెప్పేసిన అభిజీత్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -