చిరు-బాబీ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..కథ ఇదేనా..!

- Advertisement -

ప్రముఖ దర్శకుడు బాబీ (కేఎస్​ రవీంద్ర)తో మెగాస్టార్​ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు ఆచార్య షూటింగ్​లో బిజిగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్​ రీమేక్​లో నటించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత బాబీతో ఓ సినిమా చేయబోతున్నాడు. బలుపు, జై లవకుశ వంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన బాబీ చెప్పిన ఓ కథ చిరంజీవికి తెగ నచ్చిందట. దీంతో బాబీకి చాన్స్​ ఇచ్చాడు.

నిజానికి బాబీ .. చిరంజీవికి వీరాభిమాని. గతంలో చిరంజీవి అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. అలాంటిది తన అభిమాన హీరోతోనే సినిమా చేయబోతున్నాడు. అయితే ప్రస్తుతం చిరు-బాబి కొత్త చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

- Advertisement -

ఈ చిత్రంలో చిరంజీవి సినిమా హీరోగా కనిపించబోతున్నాడట. ఓ సినిమా హీరోకు అతడి అభిమానికి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. నిజానికి చిరంజీవి కమర్షియల్​ కథలనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటాడు. ఇదిలా ఉంటే బాబి-చిరు కాంబినేషనల్ వచ్చే సినిమా మాత్రం కాస్త ప్రయోగాత్మకంగానే ఉండబోతున్నదని టాక్​ వినిపిస్తోంది.

Also Read

తగ్గేదెలా అంటున్న వెంకీ మామ..!

త్రిష పెళ్లి వార్తలు నిజం కాదట..!

రాధే శ్యామ్ లవ్ స్టోరీ కానే కాదట.. నిజమెంతా ..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -