తగ్గేదెలా అంటున్న వెంకీ మామ..!

- Advertisement -

చాలా ఏళ్ల పాటు విజయాలకు దూరంగా ఉన్న సీనియర్ హీరో వెంకటేష్ ఎఫ్ 2 సినిమా నుంచి దూసుకుపోతున్నాడు. వరుస విజయాలు అందుకుంటున్నాడు. ఎఫ్ 2 తర్వాత వెంకటేష్ నటించిన వెంకీ మామ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. తాజాగా ఆయన నటించిన నారప్ప సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం వెంకటేష్,వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ -3 సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా రెండేళ్ల కిందట సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఎఫ్ 2 బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది.

కొన్నేళ్లుగా సరైన హిట్ లేని వెంకీకి ఈ సినిమా రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమా సీక్వెల్ ఎఫ్ 3 అదే కాంబినేషన్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. అయితే పొంగల్ పోటీలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి బడా స్టార్ లు తమ సినిమాలతో బరిలో దిగుతున్నారు. అయితే అనూహ్యంగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 14 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ముగ్గురు అగ్ర హీరోలు నటిస్తున్న సినిమాల మధ్య ఎఫ్ 3 రిలీజ్ కాదని వార్తలు వచ్చాయి. ఈ సినిమా విడుదల కచ్చితంగా వాయిదా వేస్తారని ప్రచారం జరిగింది.

అయితే నిన్న జరిగిన నారప్ప సక్సెస్ మీట్ లో వెంకటేష్ మాట్లాడుతూ ఎఫ్ 3 విడుదల పై క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి రేసులో ఎఫ్ 3 ఉందని కన్ఫర్మ్ చేశాడు. దీంతో ఈ సినిమాపై వచ్చిన పుకార్లకు పుల్ స్టాప్ పడింది. ఈసారి సంక్రాంతికి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, వెంకటేష్ వంటి బడా స్టార్లు నటిస్తున్న సినిమాలు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ రసవత్తరంగా మారింది.

Also Read : విడుదలకు ముందే ఏకే రికార్డ్స్.. ఇది కదా పవన్ స్టామినా..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -