మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటించారు. మ్యూజికల్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించారు. “ఆచార్య” మూవీని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మెగా పవర్ ప్యాక్డ్ మూవీని ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన ప్రమోషన్లపై దృష్టి పెట్టబోతున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ ఈ మూవీ పై అంచనాలను మరింత పెంచింది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించాలని సినిమా యూనిట్ తలపెట్టింది. ఆచార్య ప్రిరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవియే స్వయంగా సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఇందుకు జగన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరుకు మంచి సన్నిహిత్యం ఉంది. ఇప్పటికే పలుసార్లు జగన్‌ను చిరంజీవి కలిశారు. మెగాస్టార్ చొరవతోనే భారీ బడ్జెట్ చిత్రాలకు ఏపీలో టికెట్ రేట్ల విషయమై ఊరట లభించింది.
మరోవైపు “ఆచార్య” మూవీని నిర్మిస్తున్న నిరంజన్‌రెడ్డి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. సీఎం జగన్‌ను ఈ వేడుకకు ఆహ్వానించడానికి ఇదే కారణంగా చెబుతున్నారు. ఆచార్య ఫంక్షన్ కు సీఎం జగన్ వస్తే.. టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య ఉండే విబేధాలు కూడా తగ్గే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కానీ సీఎం జగన్ ఛీఫ్ గెస్ట్‌గా రావడంపై గానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ
