Friday, May 3, 2024
- Advertisement -

Dear కామ్రేడ్ రివ్యూ

- Advertisement -

డియ‌ర్ కామ్రేడ్ మూవీ
నటీనటులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న‌ త‌దిత‌రులు..
బ్యానర్: మైత్రి మూవీ మేక‌ర్స్- బిగ్ బెన్ మూవీస్
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్
దర్శకత్వం: భ‌ర‌త్ క‌మ్మ‌

కథ:

చైతన్య అలియాస్ బాబి (విజయ్ దేవరకొండ) కాకినాడ యూనివర్సిటీ లో ఒక స్టూడెంట్ లీడర్. అతని కోపం ఎప్పుడూ అతన్ని ఇబ్బందుల్లో పడేస్తూ ఉంటుంది. ఒక రోజు బాబి అపర్ణాదేవి అలియాస్ లిల్లి (రష్మిక మందన్న) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్. ఆమె కూడా బాబి తో ప్రేమలో పడుతుంది. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ బాబి కోపం వల్ల వారిద్దరి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. దీంతో విసిగిపోయిన లిల్లీ బాబి కి బ్రేక్ అప్ చెప్తుంది. ఇదిలా ఉండగా కథలో వచ్చే ట్విస్ట్ వల్ల లిల్లి జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? లిల్లి బాబిని క్షమించగలదా? వారిద్దరి మధ్య ప్రేమ కథ ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:
విజయ్ దేవరకొండ నటన ఈ సినిమాకే హైలెట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం చూపిస్తూ వస్తున్న విజయ్ దేవరకొండ ఈసారి కూడా ఒక మంచి పాత్రను ఎంచుకుని ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తాడు. తన అద్భుతమైన నటనతో తన పాత్రకు విజయ్ దేవరకొండ బాగా ఆకట్టుకుంటాడు. ప్రతి సినిమాతోనూ ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ రష్మిక మందన్న అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక మిగతా సినిమాలతో పోలిస్తే రష్మిక మందన్న ఈ సినిమాలో చాలా చాలెంజింగ్ రోల్ పాత్ర అయినప్పటికీ చాలా చక్కగా నటించి తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. కేవలం అందంతో మాత్రమే కాకుండా రష్మిక మందన్న నటన పరంగా కూడా మంచి మార్కులు వేయించుకుంది. శృతి రామచంద్రన్ నటన సినిమాకి బాగా ప్లస్ అయింది అని చెప్పవచ్చు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:
దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన కథను ఎంపిక చేశారు ఒక ఆసక్తికరమైన కథ ను తీసుకోవడం మాత్రమే కాకుండా దర్శకుడు దానిని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే లాగా మలిచిన విధానం మరియు తెరకెక్కించిన తీరు చాలా కొత్తగా మరియు అందంగా ఉన్నాయి. ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టించకుండా కథ స్లో అవ్వకుండా ఎమోషనల్ సన్నివేశాలలో సైతం ప్రేక్షకులను కట్టి పడేసాడు భరత్ కమ్మ. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై యష్ రంగినేని అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా అంతా చాలా రిచ్ గా ఉంది. జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని పాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక జస్టిన్ ప్రభాకరన్ సినిమాలు అందించిన నేపథ్య సంగీతం కూడా ప్రతి సన్నివేశాన్ని ఇంకా అందంగా మార్చింది. సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్ విజువల్స్ చాలా అందంగా బాగున్నాయి. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:
దర్శకుడు సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కి చాలా మంచి ప్రాధాన్యత ఇచ్చి వారి చుట్టూ కథను చాలా చక్కగా మలిచారు. కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ అయినప్పటికీ దర్శకుడు దానిని చాలా సులువుగా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా చాలా బాగానే నెరేట్ చేశారు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమాతో మొదటి అరగంటలోనే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. మొదటి హాఫ్ లో రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చాలా బాగుంది. వారి కెమిస్ట్రీ సినిమాకి మంచి బలాన్ని చేకూర్చింది. ఇక రెండవ హాఫ్ మొత్తం కొంచెం ఎమోషనల్ గా సాగుతుంది. నటీనటులు, స్క్రీన్ ప్లే మరియు సంగీతం సినిమాకి హైలైట్ గా చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించినా ఇక చివరగా ‘డియర్ కామ్రేడ్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు కచ్చితంగా చూడవలసిన చిత్రం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -