టాలీవుడ్ లో మళ్లీ డ్రగ్స్ కేసు కలకలం.. ఎవరెవరికి నోటీసులు‌..?

- Advertisement -

అప్పుడెప్పుడో తెలుగు సినిమా పరిశ్రమ మీద డ్రగ్స్ అభియోగం మోపబడింది. అన్నట్లు గా నే చాలా మంది సినిమా పరిశ్రమ కి సంబందించిన పెద్దల ని, యువ హీరోలని, హీరోయిన్లని విచారణ కి కూడా పిలిచారు. రవి తేజ వంటి హీరోల దగ్గర నుండి పూరి వంటి దర్శకుల వరకు చాలా మంది నే విచారించింది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.

ఇప్పుడు కొత్తగా ఈ డ్రగ్స్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మళ్లీ తిరగదోడింది. గతంలో విచారణకు హాజరైన ప్రతి ఒక్కరినీ మరోసారి విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు విచారణ కొనసాగనుంది. ఈ జాబితాలో దర్శకుడు పూరీ జగన్నాథ్ పేరు తొలి స్థానంలో ఉండగా ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, శ్రీనివాస్, నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎం, ముమైత్ ఖాన్, తనీశ్, నందు మరియు తరుణ్ ఉన్నారు.

అయితే పూరి జగన్నాథ్ – ఆగస్ట్ 31, ఛార్మి – సెప్టెంబర్ 2 , రకుల్ ప్రీత్ సింగ్ – సెప్టెంబర్ 6, రానా దగ్గుబాటి – సెప్టెంబర్ 8, రవితేజ – సెప్టెంబర్ 9, శ్రీనివాస్ – సెప్టెంబర్ 9, నవదీప్ – సెప్టెంబర్ 13, ఎఫ్ క్లబ్ జీఎం – సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్ – సెప్టెంబర్ 15, తనీశ్ – సెప్టెంబర్ 17, నందు – సెప్టెంబర్ 20, తరుణ్ – సెప్టెంబర్ 22 న రోజు విచారణ ఎదుర్కోబోతున్నారో.

Also Read: కేరళ లో మళ్లీ విజృబిస్తున్న కరోనా..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -