Friday, May 24, 2024
- Advertisement -

టాప్ హీరోల‌పై కార్పొరేట్ నీడ

- Advertisement -

టాప్ హీరోల సినిమాలంటేనే…. బాక్సాఫీస్ పండగ. అలాంటి సినిమాలకు మార్కెట్ ఓ రేంజ్ లో కార్పొరేట్ స్థాయిలో జరుగుతుంದಿ. అందుకే కాబోలు…. అంతలా కార్పొరేట్ రేంజ్ లో  ఉందని చెప్పి…

ఈరోస్ మరియు రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ లాంటి కార్పొరేట్ సంస్థలు మన సినిమాల మీద పడ్డాయి. ఇప్పటికే ఎందరో టాప్ హీరోలు ఈ సంస్థల సహకారంతో భారీ చిత్రాలు చేసుకుంటూ వస్తున్నారు.

తాజాగా ఈ లిస్ట్ లోకి పవన్ కూడా వచ్చి చేరిపోయాడు. గ‌తంలో అత్తారింటికి దారేది చిత్రానికి రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఆర్ధిక స‌హ‌కార‌మిచ్చి త‌న వాటా తాను తీసుకుంటే.. ఈసారి ఆ ప్లేస్ ను కొట్టేయ‌డానికి ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ నేనున్నానంటూ ముందుకొచ్చేసింది.

ఏకంగా 72కోట్లకు గ‌బ్బర్ సింగ్ 2 ను అమాంతం కొనేసింది. ఈ సంస్థ గ‌తంలో మ‌హేష్ చేసిన వ‌న్, ఆగ‌డు చిత్రాల‌కు  వాటాదారుడిగా ఉంది.

అలాగే బాల‌య్యబాబు త్వర‌లో చేయ‌బోయే డిక్టేట‌ర్ కు స‌హాయ‌కారిగా ఉంది. ఇపుడు ఇదిగో ఇలా ప‌వ‌న్ సినిమాతో భారీగా డిసైడ్ చేసింది. రానున్న రోజుల‌లో కార్పొరేట్ దిగ్గజాలు మ‌రీ ఎక్కువై తెలుగు నిర్మాత‌లు కనిపించకుండా పోతారేమో అన్న అనుమానం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -