సోనుసూద్ పేరిట ఘరానా మోసం!

- Advertisement -

గత ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. కరోనా నేపథ్యంలో వేల సంఖ్యలో వలస కూలీలు నానా కష్టాలు పడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు ఆదుకున్నాయి. ఈ క్రమంలోనే ఓ మానవతా మూర్తి కష్టాల్లో ఉన్నవారికి నేనున్నా అంటూ ముందుకు వచ్చాడు. ఆయనే బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఒకరు కాదు.. ఇద్దరు కాదు వందల సంఖ్యలో ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందించారు. కరోనా బాధితులకు మాత్రమే కాదు.. నిరుద్యోగులకు, తల్లిదండ్రులు లేనివారికి, వృద్దులకు కష్టాల్లో ఉన్నవారికి పెద్ద అన్నగా అండగా నిలిచారు.

కరోనా సమయంలో పేదలకు ఆర్థిక సాయం చేసి రీల్ హీరో కాదు, రియల్ హీరోగా నిలిచాడు సోనుసూద్.  అలాంటి గొప్ప వ్యక్తి పేరు చెప్పి కొంత మంది ఘరానా మోసగాళ్లు మోసాలకు పాల్పపడుతున్నారు. సాయం కోరిన బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే డబ్బులు ఇచ్చిన వారికి ఎన్నిరోజులైనా సాయం అందలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ పోలీసులు ఆశ్రయించారు.

- Advertisement -

సోనుసూద్ కార్పొరేట్ సంస్థ పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. సైబర్ క్రైం ఇన్స్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి, ఎస్సై విజయవర్దన్, పిసిలు రాజ్‌కుమార్, మహేష్ గౌడ్, అర్షద్, అనిల్ తదితరులు పట్టుకున్నారు.

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కి కరోనా పాజిటీవ్!

నక్సల్స్ తో భీకర పోరు.. జవాన్లు అదృశ్యం..!

కేరళ ఎన్నికలలో కొత్త ట్విస్ట్.. తప్పుకున్న అనన్యకుమారి అలెక్స్..?

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -

Latest News