ఆ హీరోతో ఎంట్రీ ఇవ్వబోతున్న చిట్టి

- Advertisement -

మంచి హిట్ ఒకటి పడితే చాలు.. అవకాశాలు క్యూ కడతాయి. ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి సహా పలువురు దీన్ని నిరూపించారు. తాజాగా జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఈ జాబితాలో చేరింది. చిట్టీగా జాతిరత్నాలతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఫరియా. చిన్న బడ్జెట్ మూవీగా తెరకెక్కి సంచలన విజయం అందుకుందీ మూవీ. జాతి రత్నాలు తర్వాత ఫరియాకు వరుస అవకాశాలు క్యూకట్టాయి.

రవితేజతో రావణాసుర సినిమా చేస్తోందీ బ్యూటీ..తాజాగా కోలీవుడ్‌లోని అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. బిచ్చగాడు సినిమాతో సంచలన విజయం అందుకున్న విజయ్ ఆంటోనీ సరసన ఫరియా నటించబోతోందట.

1980లో జరిగి కథలో ఫరియా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. విజయ్ ఆంటోనీ సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతుండటంతో చిట్టి అదృష్టం పండిందన్న టాక్ వినిపిస్తోంది.

వేటాడే సింహంలా విజయ్ దేవరకొండ

రాజమౌళి, మహేశ్ మూవీపై లేటెస్ట్ అప్ డేట్

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -