Friday, May 3, 2024
- Advertisement -

మా నాన్నే కాదు, నేను కూడా రెడీ అంటున్న వ‌రుణ్ తేజ్‌

- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబు బుధ‌వారం జ‌న‌సేన పార్టీలో చేరారు. త‌న అన్న‌ను పార్టీ కండువా క‌ప్పి మ‌రి ఆహ్వానించారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. నాగ‌బాబును పార్టీలోకి చేరాల‌ని ప‌వ‌నే స్వ‌యంగా కోరార‌ట‌. ఈ విష‌యాన్ని నాగ‌బాబే స్వ‌యంగా మీడియాతో చెప్పారు. నాగ‌బాబును ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న‌ట్లు పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించిన బిఫామ్‌ను కూడా నాగ‌బాబుకు అంద‌జేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. తాజాగా దీనిపై స్పందించారు నాగ‌బాబు కొడుకు వ‌రుణ్ తేజ్‌.

త‌న తండ్రి నాగ‌బాబు బాబాయ్ జ‌న‌సేన పార్టీలో చేర‌డంపై ట్విట్ చేశారు వ‌రుణ్ తేజ్‌. “మా నాన్న జనసేనలో చేరి, బాబాయ్ తో కలిసి పోటీ చేయనుండటం నాకు చాలా సంతోషకరం” అని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌ల‌నే ఆలోచ‌న‌తోనే బాబాయ్ పార్టీని పెట్టర‌ని,అందులో ఆయ‌న విజ‌యం సాధించాల‌ని మ‌న‌స్సు పూర్తిగా కోరుకుంటున్నాన‌ని తెలిపారు వ‌రుణ్ తేజ్. అవ‌స‌రం అయితే బాబ‌య్‌కు మా సాయం కావాల‌ని కోరాలే కాని ఏం చేయ‌డానికి అయిన రెడీగా ఉన్నాన‌ని ఈ సంద‌ర్భంగా వ‌రుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -