జీవజ్యోతి బయోపిక్​.. ! ఇంతకీ ఎవరీమె?

జీవజ్యోతి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. కొన్నేళ్ల క్రితం పత్రికల్లో జీవజ్యోతి పేరు మారుమోగిపోయింది. ఆమె చేసిన పోరాటాన్ని కథలు కథలుగా చెప్పుకున్నారు. ఆమె జీవితాన్ని ఎందరో ఆదర్శంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతుండటంతో మళ్లీ జీవజ్యోతి వార్తల్లో నిలిచారు. అసలు ఈ జీవజ్యోతి ఎవరు? ఆమె జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు? తదితర వివరాలు తెలుసుకుందాం..

జీవజ్యోతి తమిళనాడులోని ప్రముఖ హోటల్​ శరవణ భవన్​లో కార్మికురాలిగా పనిచేసేవారు. ఆ హోటల్​ యజమాని పేరు రాజగోపాల్​. ఆయన ముందుగా ఓ చిన్న హోటల్​గా శరవణ భవన్​ను స్థాపించారు. ఆ తర్వాత ఆయన వంటలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఫేమస్​ అయిపోయాయి. ఆయన వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగింది. రాజగోపాల్​ పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. విదేశాల్లోనూ ఆయన హోటళ్లు స్థాపించి కోటీశ్వరుడయ్యాడు.

ఇదిలా ఉంటే రాజగోపాల్​కు జాతకాల పిచ్చి ఎక్కువ. తన హోటల్​లో పనిచేసే శివజ్యోతి అనే ఆమెను పెళ్లిచేసుకుంటే మంచి జరుగుతుందని .. వ్యాపారంలో మరింత రాణిస్తావని ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. నిజానికి శివజ్యోతికి అప్పటికే వివాహం అయ్యింది. అయినప్పటికీ రాజగోపాల్​ ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. ఆమె వద్ద ఈ విషయం ప్రస్తావించగా ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో శివజ్యోతి భర్త ప్రిన్స్​ను రాజగోపాల్​ 2001లో దారుణంగా హత్యచేయించాడు. దీంతో శివజ్యోతి రాజగోపాల్​పై కేసు పెట్టింది. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది.

చెన్నై హైకోర్టు రాజగోపాల్ కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ శిక్షను సవాలు చేస్తూ రాజగోపాల్​ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. కేసు పూర్వా పరాలు పరిశీలించిన సుప్రీంకోర్టు.. రాజగోపాల్​ చేసిన నేరానికి పదేళ్ల జైలు శిక్ష చాలదంటూ అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పు అప్పట్లో సంచలనంగా మారింది. శివజ్యోతి చేసిన పోరాటాన్ని అంతా మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె జీవిత చరిత్ర ఆధారంగా జంగిల్‌ పిక్చర్స్‌ సంస్థ ఓ సినిమా నిర్మించబోతున్నది.

ఈ విషయంపై శివజ్యోతి మాట్లాడుతూ.. నా జీవితంపై ఓ సినిమా రావడం ఎంతో సంతోషకరం. పురుషాధిక్య సమాజంలో ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రేక్షకులు తెలుసుకొనే అవకాశం ఉంటుంది’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

Also Read

బిగ్ బాస్​ హోస్ట్​గా చేసేందుకు నో చెప్పిన రానా..!

ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. కేంద్రమంత్రి పదవి..లక్​అంటే ఈయనదే..!

ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ‘సౌత్ ఇండస్ట్రీయే’..!

Related Articles

Most Populer

Recent Posts