Wednesday, May 1, 2024
- Advertisement -

కూకట్ పల్లిలో కాల్పుల నిందితుల అరెస్ట్.. ఆ తప్పుతోనే బుక్కయ్యారా?

- Advertisement -

నగరంలో పట్టపగలు దుండగులు హల్ చల్ సృష్టించారు.. కూకట్ పల్లి బ్యాంకు సిబ్బందిపై కాల్పులు జరిపి నగదును ఎత్తుకెళ్లిన.. దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం విశేషం. సంగారెడ్డిలో ఎస్‌వోటీ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. సంగారెడ్డి గుండా నిందితులు నాందెడ్ కు పారిపోతుండగా.. వీరిని..ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు కేలం 8 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.

ఈ కేసులో కాల్పులకు పాల్పడిన నిందితులు పాత నిందితులేనని పోలీసులు తొలుత నిర్ధారణకు వచ్చారు. 15 రోజుల క్రితం జీడిమెట్లలో బ్యాంకు చోరికి పాల్పడిన ముఠానే..తేలిందని పోలీసులు వెల్లడించారు. బేగంపేటలో ఉన్న HDFC BANK తమ పరిధిలో ఉన్న ఏటీఎంలలో బ్యాంకు సిబ్బంది డబ్బులు నింపేందుకు వెళుతుంటారు. మొత్తం రూ. 2 కోట్ల 70 వేలతో సిబ్బంది బయలుదేరారు. చిత్తల శ్రీనివాస్, సెక్యూర్టీ గార్డు సుభాన్ ఆలీ ఇతరులున్నారు. కూకట్ పల్లిలో ఉన్న ఏటీఎంకు వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్నారు.

2.10 గంటలకు దుండగులు అక్కడకు చేరుకుని సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ ఏటీఎం గ్లాస్ కు తగిలింది. అంతలో ఆలీ అప్రమత్తమయ్యాడు. సెక్యూర్టీ డ్రెస్ లో ఉన్న ఆలీపై కాల్పులు జరపడంతో కుప్పకూలి చనిపోయాడు. అక్కడ ఉన్న 12 లక్షలు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు.. కానీ సూపర్ వైజర్ శ్రీనివాస్ ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఇతనిపై కూడా కాల్పులు జరిపారు. ఇతని కాలికి గాయమైంది. 5 లక్షలు అందడంతో వాటిని తీసుకు వెళ్లారు. . సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగులు అక్కడ వదిలేసిన గన్ మేగజైన్, హెల్మెట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలో మినీ పురపోరు పోలింగ్ ప్రారంభం

నేటి పంచాంగం, శుక్రవారం (30-04-2021)

విద్యార్థుల కోసం కేఏపాల్ దీక్ష..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -