విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కానుకగా ‘లైగర్’ టీజర్?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో అతి కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధించాయి. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.

హీరోగా విజయ్ దేవరకొండ మార్క్ కూడా పూరికి దగ్గరగానే ఉంటుంది గనుక, ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ నెల 9వ తేదీన విజయ్ దేవరకొండ పుట్టినరోజు .. అందువలన ఆ రోజున ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు.

- Advertisement -

ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

అషుతో డేటింగ్ పై రాహుల్ షాకింగ్ కామెంట్స్..!

రెండో సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు వీళ్ళే!

శంకర్, చరణ్ మూవీలో స్టార్ హీరో!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -