Monday, April 29, 2024
- Advertisement -

మా ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయా?

- Advertisement -

మా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది స్పష్టమైన ప్రకటన రాకున్నా ఇప్పటికే హడావుడి మొదలైంది. నిజానికి కరోనా లేకపోతే.. సెప్టెంబర్​లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సారి ఎన్నికల కంటే చాలా ముందే హడావుడి మొదలైంది. విలక్షణ నటుడు ప్రకాశ్​ రాజ్​ ఈ సారి బరిలో ఉండబోతున్నారు. ఆయనకు మెగా క్యాంప్​ మద్దతు ఇస్తోంది. మరోవైపు మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్​ నరసింహారావు తదితరులు సైతం పోటీ పడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రకాశ్​రాజ్​ అందరికంటే ముందే ఎన్నికలకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే తన ప్యానెల్​ను కూడా ప్రకటించారు. మా ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు ఎప్పుడంటూ ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్​కు ట్వీట్లు కూడా చేశారు.ఇక మంచు విష్ణు సైతం నిత్యం మీడియాతో టచ్​లో ఉంటూ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాడు. మంచు విష్ణుకు.. ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్​, నందమూరి ఫ్యామిలీ మద్దతుగా నిలుస్తోందని టాక్​.

మా ఎన్నికలపై హడావుడి జరుగుతున్న ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అయితే త్వరలో మా ఈసీ( ఎగ్జిక్యుటివ్​ కమిటీ) సమావేశం కాబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ మీటింగ్​ జరిగే చాన్స్​ ఉంది. ఎన్నికల విషయంలో ఈ సమావేశంలో ఏదో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ఈ ఎన్నికలపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇటీవల నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా కోసం ఇప్పటివరకు ఒక్క భవనం కూడా లేదని.. సినీ పెద్దలు ఏం చేస్తున్నారంటూ ఆయన దుయ్య బట్టారు. ఈ విషయంపై మెగా శిబిరం నుంచి గట్టిగానే కౌంటర్లు వచ్చాయి. ఇక మంచు విష్ణు సైతం అప్పుడప్పుడు టీవీ చానల్స్​లో చర్చల్లో పాల్గొంటూ హీట్​ రాజేస్తున్నాడు. ఇక ప్రకాశ్​ రాజ్​ మద్దతు కూడగట్టుకొనే పనిలో పడ్డారు. మెగా క్యాంపు మొత్తం ఆయన వెంటే ఉండటంతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు.

Also Read

స్పెషల్​ సాంగ్​కోసం సన్నీ లియోన్​ రెమ్యునరేషన్​ ఎంతంటే?

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఏకే ‘ షూట్ మళ్లీ మొదలు..!

త్రిష పెళ్లి ఫిక్స్..​? వరుడు ఎవరంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -