‘మా’ లో ముసలం.. కృష్ణంరాజుకు ఈసీల లేఖ కలకలం

- Advertisement -

మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకున్నది. 2021 మార్చితో మా పదవీకాలం ముగిసిపోయింది. అప్పుడే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్​తో ఎన్నికలు జరగడం లేదు. మా ఎన్నికల్లో పోటీచేయబోతున్నానంటూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్​ ప్రకటించారు. తన ప్యానెల్​ను కూడా ప్రకటించేశారు. కానీ ఎన్నికల నిర్వహణ విషయంపై మా అధ్యక్షుడు నరేశ్​ క్లారిటీ ఇవ్వడం లేదు.

ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ప్రకాష్ రాజ్​ ట్వీట్లు కూడా చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని మా అధ్యక్షుడు నరేశ్​ ట్విట్టర్​లోనే బదులిచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నది. మా అసోసియేషన్​లో ఉన్న 15 మంది సభ్యులు (ఈసీ) క్రమశిక్షణాసంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. ప్రస్తుతం మా పదవీ కాలం ముగిసిపోయింది కాబట్టి.. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారు ఆ లేఖలో కోరారు.

అయితే ఇప్పటికే మా లో ఉన్న పలువురు సభ్యులు ప్రకాష్ రాజ్​ ప్యానెల్​లో చేరిపోయారు. తాజాగా 15 మంది సభ్యులు లేఖ రాయడం తీవ్ర కలకలంగా మారింది. ఈ విషయంపై మా అధ్యక్షుడు నరేశ్​ ఎలా స్పందిస్తారో? వేచి చూడాలి. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంపై నరేశ్​ ఎలా స్పందిస్తారో? వేచి చూడాలి.

Also Read

రెబల్ స్టార్ మూవీలో తొలిసారి సమంత..!

‘సలార్​’ కథలో భారీ మార్పులు..!

‘ప్రాజెక్ట్ కే’ కోసం 200 డేస్ కేటాయించిన రెబల్ స్టార్..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -