Friday, April 26, 2024
- Advertisement -

‘మన ఊరి రామాయణం’ రివ్యూ

- Advertisement -

ఎలాంటి పాత్ర అయిన చెయ్యగల సత్తా ఉన్న నటుడు ప్రకాశ్ రాజ్. తన అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాలకు విజయం దక్కేలా చేశారు. ప్రకాశ్ రాజ్ నటుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగానూ తనేంటో నిరుపించుకున్నారు.

తాజాగా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మన ఊరి రామాయణం’.  ప్రకాష్ రాజ్‌తో పాటుగా ప్రియమణి, సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మన ఊరి రామాయణం ఎలా ఉందో? చూద్దాం..

కథ :

ఊర్లో పేరూ, మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి భుజంగయ్య (ప్రకాష్ రాజ్). మంచి వ్యక్తిగా.. తన కుటుంబంతో సమాజంలోనూ మంచిగా జీవితం గడపాలన్నదే భుజంగయ్య కోరిక. అలాంటి మనిషి కుటుంబంతో చిన్న గొడవ పడి, ఆ కోపంలో ఒకరోజు ఓ వేశ్య (ప్రియమణి)తో సరదాగా గడపాలనుకుంటాడు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో భుజంగయ్య తన ఇంటిని ఆనుకొనే ఉండే ఓ చిన్న కొట్టులో ప్రియమణితో పాటు చిక్కుకుపోతాడు. ఆ తర్వాత తన పరువు పోకుండా, ఎవ్వరికీ ఈ విషయం తెలియకుండా భుజంగయ్య ఎలా బయటపడ్డాడు? ఈ మొత్తం తతంగంలో ఆయనలో వచ్చిన మార్పేంటీ అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్రధాన బలం ప్రకాష్ రాజ్ నటన, ఆయన ఎంచుకున్న కథను అని చెప్పుకోవాలి. అందరి దృష్టిలో రాముడిలా, మంచి వాడిలా కనిపించే మనిషికే రావణాసురిడి తరహాలో తప్పుడు ఆలోచనలు వస్తే ఏం అవుతుంది అనే ఆలోచనను కథగా మలిచిన విధానం చాలా బాగుంది. ఈ కథను తెరమీద మలిచిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా కథలోని ఎమోషన్ చాలా బాగుంది. ఆ ఎమోషన్‌ను కూడా ఎక్కడా స్థాయి మించనివ్వకుండా చూడడం ఇంకా బాగా ఆకట్టుకుంది. ఇక కథానుసారంగా వచ్చే జెన్యూన్ ఫన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రకాష్ రాజ్ రైటింగ్‌లోని ప్రతిభంతా కథ నుంచే పుట్టించిన ఫన్‌లో చూడొచ్చు. భుజంగయ్య పాత్రలో ప్రకాష్ రాజ్ నటన అద్భుతం అని చెప్పాలి. చిన్న చిన్న ఎమోషన్స్‌ను పలికించడంలో ఆయన చూపిన నేర్పు గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లైమాక్స్ సన్నివేశాల్లో అయితే ఆయన నటన అద్భుతమనే చెప్పాలి. ప్రియమణి తన పాత్రలో ఒదిగిపోయి నటించేసింది. ఎండ్‌కార్డ్ పడే సమయంలో ప్రియమణి నటన సింప్లీ సూపర్బ్ అనాల్సిందే. సత్యదేవ్ ప్రకాష్ రా‌జ్‌కు నమ్మిన భంటుగా చాలా బాగా చేశాడు. 

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్‌లో కొన్నిచోట్ల కథా వేగం తగ్గి బోర్ కొట్టించడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్నిచోట్ల అనవసరమైన సన్నివేశాలతో కథలోకి వెళ్ళకుండా పక్కదార్లు పట్టినట్లు అనిపించింది. ఇక రెగ్యులర్ కమర్షియల్ అంశాల జోలికి అస్సలు పోకుండా ఉన్న ఈ సినిమా అలాంటి అంశాలే కోరేవారికి నచ్చకపోవచ్చు.

మొత్తంగా:

తన చుట్టూ ఉండేవాళ్ళు తనను గౌరవించాలీ, సమాజంలో పరువు, ప్రతిష్టలతో బతకాలి అని కోరుకునే ఓ పెద్దమనిషి, ఒకానొక రోజు మత్తులో చేసే కొన్ని తప్పులు ఆయనను ఎటువైపు తీసుకెళ్ళాయన్న బలమైన ఎమోషన్‌తో ఓ సినిమా చేయాలన్న ప్రయత్నమే మన ఊరి రామాయణంకి ప్రధాన బలం. నటినటులంతా అద్భుతంగా నటించడం మన ఊరి రామాయణంకి మరో బలం. ఈ సినిమాలో రెగ్యులర్ కమర్షియల్ అంశాలు లేకపోవడమే మైనస్. ‘మన ఊరి రామాయణం’ రాముడిలా కనిపించే వ్యక్తిలో రావణాసురుడిని బయటకు చూపించే సినిమా అని ఒక్కమాటలో చెప్పోచ్చు.

{youtube}hqBaBZCn8-o{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -