Friday, April 26, 2024
- Advertisement -

గర్వ పడూతున్నాను.. కానీ ఇదే పరిష్కారమా ? : మంచు లక్ష్మీ

- Advertisement -

గత పది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న దిశ అత్యాచారం, హత్య ఘటనకు ఈ రోజు ముగింపు పలికారు తెలంగాణ పోలీసులు. కేసు విచారణలో భాగంగా నింధితులను ఘటన స్థాలానికి తీసుకెళ్లారు పోలీసులు. అయితే అక్కడ అ నిందితులు తిరగబడటంతో ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. అయితే ఈ సంఘటనపై యావత్ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ ఘటనపై నటి నిర్మాత మంచు లక్ష్మీ స్పందించారు. ’దిశకు జరిగిన అన్యాయం తెలిసినప్పటి నుంచి నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను. ఈ రోజు ఎన్ కౌంటర్ వార్త వినగానే ఒక మహిళగా.. తల్లిగా చాలా సంతోషించాను. కానీ ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారమా ? అంటే మాత్రం చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఘటనలాగే ఎన్నో సంఘటనలు చూడలేము.

ఇలాంటి పరిస్థితి అన్ని సందర్భాలలోనూ రావలి. నిర్భయ కేసులో నేరస్థులను 7 ఏళ్లగా మేపుతున్నారు ? వాళ్లల్లో ప్రధాన నిందితుడు బయట హాయిగా తిరుగుతున్నాడు ? దిశానే కాదు నెలలు పాపలు, ముసలి వాళ్లు ఏం తప్పు చేశారు ? ఎన్ కౌంటర్ అన్నింటికి సమాధనం కాదు. ఈ రోజు జరిగిన సంఘటనతో ఒక తల్లిగా అమ్మాయిగా గర్వ పడూతున్నాను. వాళ్ల తల్లిదండ్రులకు కొంత ఉపశమనం.. కానీ వారి బాధ ఎప్పటికీ పోదు.

ఆడవాళ్ల స్వేచ్చను అడ్డుకోవడానికి ఎవరికీ హక్కు లేదు. 80 శాతం రేప్‌లు బయటకు రావు..? ఫ్రెండ్లీ పోలీసింగ్ పెరగాలి. చట్టాలు మారాలి, ఆ మార్పులు వస్తాయి అంటే ఇండస్ట్రీని మొత్తాన్ని బయటకు తెస్తాను. కానీ చట్టాలను గౌరవించండి. ఎడ్యుకేషన్ సిస్టం నుండి, తల్లిదండ్రులు ఆడపిల్లలను పెంచే తీరులో సమానత్వం రావాలి` అని మంచు లక్ష్మీ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -