Friday, April 26, 2024
- Advertisement -

‘మీకు మాత్రమే చెప్తా’ మూవీ రివ్యూ..!

- Advertisement -

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ’మీకు మాత్రమే చెప్తా’. ఈ చిత్రంలో దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించారు. షమ్మీర్ సుల్తాన్ ఈ సినిమాని తెరక్కించాడు. మంచి అంచాలతో ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ : రాకేష్(తరుణ్ భాస్కర్) తన ప్రేయసి శాంతి(వాణి భోజన్) ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్న టైంలో అతని ఫోన్ కు ఓ వీడియో వస్తుంది. ఆ వీడియో రాకేశ్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియో. అది కనుక బయటకు వస్తే రాకేశ్ పెళ్లి అగిపోవడంతో పాటు చాలా జరుగుతాయి అని.. ఎలాగైన ఆ వీడియో బయటకు రాకుండా ఉండేందుకు రాకేష్, అతని ఫ్రెండ్ చాలా ప్రయత్నాలు చేస్తారు. మొత్తానికి ఆ వీడియో వైరల్ కాకముందే తొలిగిస్తారు. అందరు హ్యాపీ అనుకున్న టైంలో ఆ వీడియో బయటకు వస్తోంది. ఆ వీడియో మళ్లీ రాకేశ్ కు ఎలా వచ్చింది ? రాకేష్ కు ఆ వీడియో పంపిన వ్యక్తి ఎవరు ? మరి రాశేష్, శాంతి పెళ్లి జరిగిందా ? ఇలాంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : ముందు నుంచి చెప్పినట్లు సినిమా మంచి కామెడీతో సాగుతోంది. ప్రధానంగా తరుణ్ భాస్కర్ కు సంబంధించిన వీడియో బయటకు రావడం తో అక్కడ నుంచి కథనం చాలా బాగుంటుంది. తరుణ్ భాస్కర్, అతని ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ.. ఇతర పాత్రల మధ్య వచ్చే కామెడీ సినిమాకి చాలా హైలైట్. సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ ను దర్శకుడు తీసుకొచ్చాడు. ఇక అనసూయ రోల్ అందర్ని థ్రిల్ చేస్తోంది. అలానే తరుణ్ కు సంబంధించిన వీడియోలోని ట్వీస్ట్ బాగుంది. ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే తరుణ్, అభినవ్, అనసూయ తమ పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. హీరోయిన్ గా నటించిన వాణి భోజన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఫోటోగ్రాఫీ, మ్యూజిక్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతోంది. ల్యాగ్ సీన్స్ తగ్గించి ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం మైనస్ పాయింట్. అక్కడ అక్కడ కాస్త బోర్ కొట్టించే సీన్స్ ఉన్నాయి.

మొత్తంగా : మీకు మాత్రమే చెప్తా మంచి కామెడీ ఎంటర్ టైనర్. డీసెంట్ కామెడీ తో సినిమా సాగుతోంది. ప్రధాన పాత్రల మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఓవారాల్ గా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుతూ బయటకు వస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -