ఆ చిన్నారిని తెగ ప్రశంసించిన మెగాస్టార్.. ఎందుకంటే?

- Advertisement -

ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ప్రజల సమస్యలపై స్పందిస్తూ తన సేవా గుణాన్ని చాటుకుంటున్నాడు టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి.ఇటీవలే సీనియర్ నటి శ్యామల ఆర్థిక పరిస్థితులపై స్పందించి ఆమెకు సహాయం అందించాడు. ప్రస్తుతం కరోనా రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.వారి ప్రాణాలకు రక్షణ కల్పించడానికి తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకు ఒక ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి ఎంతోమందికి ప్రాణ దానం చేసి రియల్ హీరో గా నిలిచాడు.

తాజాగా ఓచిన్నారి చేసిన పని తనను కదిలించిందంటూ చిరంజీవి ట్విటర్‌ వేదికగా ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. వివరాల్లోకి వెళితే…శ్రీనివాస్‌,హరిణిల కూతురు అన్షి ప్రభాల పుట్టినరోజు సందర్భంగా ఆ పాప దాచుకున్న డబ్బులతోపాటు పుట్టినరోజు వేడుకలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఆక్సిజన్‌ బ్యాంకుల కోసం చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు ఇచ్చి తన ఉదార స్వభావాన్ని, సమాజం పట్ల గౌరవాన్ని చాటుకుంది.

- Advertisement -

Also read:పొట్టి నిక్కర్ లో.. హల్ చల్ చేస్తున్న అర్జున్ రెడ్డి బామ!

పాప అన్షి ప్రభాల పై చిరంజీవి ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఇతరుల కష్టాలు తెలుసుకొని జీవించడం అంటే చాలా గొప్ప విషయం. ఇంత చిన్న వయసులోనే ఆ పాప ఎంత ఉన్నతంగా ఆలోచించి నలుగురికి సాయపడాలనే ఉద్దేశంతో ముందుకు రావడం నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తోంది .అలాగే ఆ పాపను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే పాపకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి ఎమోషనల్ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

Also read:లాక్ డౌన్ ఎఫెక్ట్: పెయింటర్ గా మారిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -