అమితాబ్‌తో నాగ్ సినిమా ఫిక్స్‌

- Advertisement -

టాలీవుడ్ కింగ్ నాగ‌ర్జున మ‌రోసారి బాలీవుడ్ మూవీ చేయ‌బోతున్నాడు.అది కూడా బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ అమితాబ్ బచ్చన్‌తో క‌లిసి ఓ మూవీలో న‌టించ‌నున్నాడు.కరణ్ జోహర్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘బ్రహ్మస్త్ర’ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది.ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ తదితరులు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నాగ్‌ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమాలో ఓ మంచి రోల్ కోసం నాగ‌ర్జునని సంప్రందించార‌ట ..కథ నాగార్జునకు నచ్చడం పైగా తాను ఎంతో ఇష్టపడే అమితాబ్ కూడా నటిస్తుండడంతో నాగార్జున వెంటనే ఈ హిందీ సినిమాకు ఓకే చెప్పాడని ప్రముఖ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. ముంబైలో జరగబోయే షెడ్యూల్ లో నాగార్జున పాల్గొంటాడని కథనంలో పేర్కొన్నారు.నాగార్జున గతంలో కూడా హింది సినిమాలు చేశాడు.మ‌ళ్లీ ఇన్నాళ్లుకు నాగ్ బాలీవుడ్ మూవీతో అభిమానుల‌ను అల‌రించనున్నాడు.

- Advertisement -

 

 

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -