భర్త తో ఏకాంతంగా ఉన్న ఫోటో షేర్ చేసిన నమిత..!!

- Advertisement -

హీరోయిన్ నమిత పెళ్లి చేసుకుని సినిమా లైఫ్ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.. అయితే అవకాశం వస్తే రీ ఎంట్రీ కి ఆమె సిద్ధమని చెప్తున్నారు సన్నిహితులు.. అయితే సినిమాల ద్వారా ప్రేక్షకులకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను ఎప్పుడు అలరిస్తూ ఉన్నారు. నమిత.. సెల‌బ్రిటీలు అన్నాక సోష‌ల్‌మీడియాలో త‌మ ఫ్యాన్స్‌తో ట‌చ్‌లో ఉండ‌డం మామూలే. ఎప్ప‌టికప్పుడు తాము చేసే ప‌నుల‌కు సంబంధించిన పోస్టుల‌ను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేస్తూ అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటారు. అయితే కొంద‌రు సెల‌బ్రిటీలు త‌మ ప‌ర్స‌న‌ల్ ఫోటోల‌ను కూడా ఈ మ‌ధ్య షేర్ చేస్తున్నారు.

ముఖ్యంగా మాజీ న‌టి న‌మిత త‌న భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను తాజాగా త‌న ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేయ‌గా.. ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. కోలీవుడ్‌కు చెందిన వీరేంద్ర చౌద‌రిని న‌టి న‌మిత ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం విదితమే. వీరిద్దరిదీ అన్యోన్య‌మైన దాంపత్యంగా మారింది. క‌ల‌హాలు లేకుండా ప్రేమ‌ను పంచుకుంటూ కాపురం చేస్తున్నారు. ఇక న‌మిత ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ దాంప‌త్య జీవితంలోని మ‌ధుర క్ష‌ణాల‌కు చెందిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా రెండు ఫోటోల‌ను పోస్ట్ చేసింది.

- Advertisement -

ఒక ఫొటోలో న‌మిత త‌న భ‌ర్త వీరేంద్ర చౌదిరికి ముద్దు పెడుతూ ఉంది. మ‌రొక ఫొటోలో అత‌నిపై కూర్చుని ఉంది. ఇక ఆ ఫొటోల‌కు కామెంట్స్ కూడా పెట్టింది. మేం ఇద్ద‌రం ఇలా క‌లుసుకుని 4 ఏళ్లు అయింది. ఆ స‌మ‌యంలో ఒక న‌దిలో నీటి ప్ర‌వాహంలా సాగాం. ఇంకా 40 ఏళ్లు ఇలాగే సాగుతాం. చీర్స్‌.. అంటూ కామెంట్ చేసింది. కాగా న‌మిత షేర్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌గా నెటిజ‌న్లు ఈ విష‌యంపై హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -