’మా’బిల్డింగ్ డబ్బులు ఏం చేశారు : బాలయ్య

- Advertisement -

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గురించి పెద్దలు జరిపిన చర్చలపై ఇటీవల నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. “భూములు పంచుకుంటున్నారు” అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దూమారం రేగింది. అయితే బాలయ్య మనసులో ఏం పెట్టుకోకుండా ఏం అనిపిస్తే అదే మాట్లాడుతారు. అలా ఆయన మాట్లాడిన సందర్భాలు మనం ఇప్పటికే ఎన్నో చూశాం.

ఇప్పుడు తాజాగా ఓ వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) బిల్డింగ్ కట్టడం కోసం అమెరికాలో చేసిన షోలకు తనను పిలవకపోవడం గురించి బాలయ్య ప్రస్తావించారు. ‘మా’ బిల్డింగ్ కట్టారా అని ఆయన ప్రశ్నించారు. బాలయ్య మాట్లాడుతూ.. ‘మా’ కోసం బిల్డింగ్ కడతామని అన్నారు. అమెరికా వెళ్లారు. నన్ను పిలిచారా? చిరంజీవిగారు అంతా కలిసి అమెరికా వెళ్లారు. డల్లాస్ లో ఫంక్షన్ చేశారు. ఐదు కోట్లు అన్నారు. ‘మా’ కోసం బిల్డింగ్ కట్టారా. మద్రాస్ లో చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంతో సపోర్టింగ్ గా ఉంది. అడిగితే రెండు మూడు ఎకరాలు ఫ్రీగా ఇవ్వరా? ఇండస్ట్రీ నుంచి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు? కరోనాని పక్కన పెట్టి ఎందుకు సినిమా షూటింగ్స్ మొదలెట్టాలని ఆరాటం? కారణం ట్యాక్సులు.. డబ్బు.

- Advertisement -

ఈ సొసైటీలో అత్యధికంగా టాక్స్ పే చేసేది మా సినీ ఇండస్ట్రీనే. ఇంత వరకు ‘మా’ బిల్డింగ్ కట్టలేదు. మద్రాస్లో చూడండి. మేం డబ్బులు పెట్టి కట్టుకోలేమా అనే ఆ ఆలోచనలు రావు. అక్కడికి వెళ్లారు. ఏదో 5 కోట్లు అన్నారు. తర్వాత కోటి అన్నారు. మిగతా 4 కోట్లు ఏమయ్యాయి? అందుకే నేను ఇలాంటి విషయాల్లో ఏం కలుగజేసుకోను. హిపోక్రసి సైకోఫాన్సీ ఎక్కువ. మైకులు చూడగానే పిచ్చెక్కుతుంది కొందరికి అంటూ కౌంటర్లు వేశాడు బాలయ్య. మరి బాలయ్య వ్యాఖ్యాలపై మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష) పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -