Friday, April 26, 2024
- Advertisement -

స‌గ‌టు యువ‌కుడి సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’

- Advertisement -

. స‌గ‌టు యువ‌కుడి సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’
శ్రీవిష్ణు మ‌రో హిట్ కొట్టేశాడు..

హీరోల‌తో పాటు స్నేహితుడి పాత్ర‌ల్లో మెరుస్తున్న శ్రీవిష్ణు త‌న‌కు తాను హీరోగా కూడా సినిమాలు చేస్తూ మంచి విజ‌యాలు అందుకుంటున్నాడు. మొన్న‌నే ‘మెంటల్‌ మదిలో’ అనే సినిమాతో ఆక‌ట్టుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ స‌గ‌టు యువ‌కుడి క‌థ‌గా సినిమాతో వ‌చ్చాడు. ట్రైల‌ర్‌, ఫ‌స్ట్‌లుక్‌లు, ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో ఆక‌ట్టుకున్న శ్రీవిష్ణు మ‌ళ్లీ హీరోగా థియేట‌ర్ల‌కు వ‌చ్చాడు. మ‌రీ ఆ సినిమా ఎలా ఉంది? మ‌రోసారి శ్రీవిష్ణు హిట్ కొట్టాడా? లేదా చూద్దాం!

క‌థ‌: చ‌దువు బుర్ర‌కు ఎక్క‌ని యువ‌కుడు సాగ‌ర్ (శ్రీవిష్ణు). ఉత్త‌మ ఉపాధ్యాయుడిగా పేరు పొందిన తండ్రి (దేవీ ప్ర‌సాద్) త‌న కొడుకునే చ‌దివించ‌క‌లేకపోవ‌డంతో బాధ‌ప‌డుతుంటాడు. ఎప్పుడూ క్రికెట్.. సినిమాలు అంటూ అల్ల‌రిగా ఫ్రెండ్స్‌తో తిరుగుతుంటాడు. తండ్రితో చీవాట్లు తింటూ సాగ‌ర్ ఉంటాడు. ఈ నేప‌థ్యంలో డిగ్రీ పాస్ కావ‌డానికి తీవ్రంగా క‌ష్ట‌ప‌డ‌తాడు. తండ్రి బాధ చూడ‌లేక తండ్రికి న‌చ్చిన‌ట్లు ఉందాం.. తాను మారదాం అని కొన్ని ప్ర‌య‌త్నాలు చేస్తాడు. కానీ అవ‌న్నీ విఫ‌ల‌మై చివ‌రికి తండ్రికి చిర్రెత్తుకొస్తుంది. చివ‌ర‌కు తనకు నచ్చింది చేయడానికి వీలుకాక, తండ్రికి నచ్చినట్టు మారలేక తీవ్ర ఒత్తిడికి, వేదనకు గురై ఇంట్లోంచి బయటికొస్తాడు. ఆ స‌మ‌యంలో సాగ‌ర్ జీవితంలోకి వ‌స్తుంది ధార్మిక (స‌ప్న టైటిస్). ఏళ్లు గడుస్తున్నా ఏం చేయాలో తెలియ‌క మాన‌సిక రోగిలా మారిపోతుంటాడు సాగ‌ర్. చివ‌రికి ఇత‌ను ఏమ‌య్యాడు..? త‌ండ్రి అనుకున్న‌ట్టు సాగ‌ర్ మార‌డా? ధార్మిక ప‌రిచ‌యంతో శ్రీవిష్ణు ఏమ‌య్యాడు అనేది సినిమా చూడాల్సిందే!

క‌థ‌నం: ఈ సినిమా సామాన్య మధ్య తరగతి కుటుంబ క‌థ‌. ప్రతీ ఇంట్లో ఉండే సమస్యను ద‌ర్శ‌కుడు కథా వస్తువుగా తీసుకుని చ‌క్క‌గా తీర్చిదిద్దాడు. ప్రేక్షకుడు ఇది నా కథ అని ఫీల‌య్యేలా చేశాడు. మనకు నచ్చిన పనిచేయడంలోనే ఆనందం ఉంది అనే ఇతివృత్తాన్ని మనసుకు హత్తుకునేలా చూపించాడు దర్శకుడు. పతాక సన్నివేశాలు కూడా అందుకు బలాన్ని ఇస్తాయి. విద్యార్థుల మనస్తత్వాలు.. తల్లిదండ్రుల ఆలోచలు.. ర్యాంకుల కోసం పరుగు.. ఇలాంటివి మారాలని చాటి చెప్పే చిత్రం ఇది. భవిష్యత్‌లో ఏదో కావాలని చిన్న చిన్న ఆనందాలను వదిలేసి వెంపర్లాడే ఈ తరానికి కళ్లకు కట్టేలా గట్టి సందేశాన్ని ఇచ్చింది. సంగీతం కూడా సినిమాకు తగ్గట్టు ఉంది. ఎక్కడా కమర్షియల్ లెక్కల కోసం పాటలను ఇరికించలేదు. ప్రతీ పాట కథలో భాగంగా ఉంటాయి. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి తన నేపథ్య సంగీతంతో కథలోని భావోద్వేగాలను మరింతగా పండించేలా చేశాడు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీన‌టులు: శ్రీవిష్ణు తన కెరీర్‌లో మరోసారి అద్భుతమైన నటన కనబరిచాడు. త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌ను సాగర్‌ పాత్రలో క‌న‌బ‌ర‌చాడు. హీరోయిన్ స‌ప్న టైటిస్ బాగా న‌టించింది. తండ్రి పాత్ర‌లో దేవీ ప్రసాద్ న్యాయం చేసి స‌ద‌రు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తిగా క‌నిపించారు. సంగీతం, పాటలు అందులోని అర్థవంతమైన పదాలు ఈ కథకు మరింత వన్నె తెచ్చాయి. చాలా సహజమైన వాతావరణంలో సినిమాను తీయ‌డంతో ప్రేక్ష‌కులు బాగా ఫీల‌య్యే అవ‌కాశం ఉంది. దర్శకుడు త‌న క‌థ‌ను పక్కదారి పట్టకుండా చక్కగా తెర‌కెక్కించి థియేట‌ర్‌లో విడుద‌ల చేశాడు.

ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అవ‌కాశం ఉంది.

నటీనటులు: శ్రీ విష్ణు.. సత్నా టిటస్‌.. దేవీ ప్రసాద్‌ తదితరులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు వూడుగుల
సంగీతం: సురేశ్‌ బొబ్బిలి
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్ (ఆరాన్‌ మీడియా వర్క్స్‌, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌)
సమర్పణ: నారా రోహిత్‌, అట్లూరి నారాయణరావు

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -