Saturday, May 11, 2024
- Advertisement -

‘పరిచయం’ మూవీ రివ్యూ

- Advertisement -

కొత్త న‌టీన‌టుల‌తో తెర‌కెక్కిన సినిమా ‘ప‌రిచియం’.సినిమా ట్రైల‌ర్‌తోనే అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.విరాట్‌ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఎమోషనల్‌ లవ్‌ స్టోరి ‘పరిచయం’. లక్ష్మీకాంత్‌ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ : ఆనంద్‌ (విరాట్‌), లక్ష్మీ (సిమ్రత్‌ కౌర్‌) రైల్వేలో ఉద్యోగాలు చేసే సుబ్రమణ్యం (రాజీవ్‌ కనకాల), సాంబ శివరావు (పృథ్వీ)ల పిల్లలు. ఒకే రోజు ఒకే హాస్పిటల్‌లో పుట్టిన వీరిద్దరు చిన్నతనం నుంచి కలిసే పెరుగుతారు. ఒకరంటే ఒకరికి ప్రేమున్న అది చెప్పుకోకుండానే ఏళ్లు గడిచిపోతాయి. చిరవకు ఆనంద్‌ ధైర్యం చేసి తన ప్రేమ గురించి చెప్పేస్తాడు. కానీ వెంటనే విషయం ఇద్దరి ఇళ్లలో తెలియడంతో గొడవ అవుతుంది. అబ్బాయి అమ్మాయి కలిసి రోడ్డు మీద కనిపించటమే తప్పు అని భావించే సాంబశివరావు తన కూతురే మరో అబ్బాయితో కనిపించే సరికి రగిలిపోతాడు. కూతుర్ని కొట్టి మరొకరితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. దీంతో లక్ష్మీ చనిపోవాలని పురుగుల మందు తాగేస్తుంది. లక్ష్మీ చేసిన పనివల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి..?అన్నదే మిగతా కథ.

విశ్లేషణ: హైదరాబాద్‌ నవాబ్స్ లాంటి కామెడీ చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మీకాంత్‌ చెన్నా, విరాట్‌ను హీరోగా పరిచయం చేసేందుకు మాత్రం ఓ ఎమోషనల్‌ లవ్‌ స్టోరిని ఎంచుకున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన కథ అని చెప్పినా.. చాలా సన్నివేశాల్లో ఇతర చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాల్లో సింహాద్రి, వసంత కోకిల సినిమాల ప్రభావం కనిపిస్తుంది. అయితే బలమైన కథను రాసుకున్న దర్శకుడు అంత ఆసక్తికరంగా తెరమీద చూపించడంలో తడబడ్డాడు.

తొలి సినిమానే ఇంతటి ఎమోషనల్‌ సినిమాను ఎంచుకోవటం విరాట్ చేసిన సాహసమనే చెప్పాలి. తన పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేసినా.. అక్కడక్కడ అనుభవలేమి బయటపడుతుంది. హీరోయిన్‌గా నటించిన సిమ్రత్‌ అందంగా కనిపించింది. నటనపరంగా కూడా ఆకట్టుకుంది. రాజీవ్‌ కనకాలకు చాలా రోజుల తరువాత మంచి పాత్ర దక్కింది. తనదైన పర్పామెన్స్‌ తో సుబ్రమణ్యం పాత్రలో జీవించాడు రాజీవ్‌.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు : సినిమాకు మేజర్‌ ప్లస్ పాయింట్ నరేష్‌ రానా సినిమాటోగ్రఫి. అరుకు అందాలను మరింత అందంగా వెండితెర మీద ఆవిష్కరించారు. పాటలు, లోకేషన్లు ఫ్రెష్ ఫీల్ కలిగిస్తాయి. శేఖర్‌ చంద్ర సంగీతం బాగుంది.

బోట‌మ్ లైన్ : సిల్లీగా క‌నిపించే సిరీయ‌స్ ప్రేమ‌క‌థ‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -