వకీల్ సాబ్ దెబ్బకీ థియేటర్ కుర్చీలు, త‌లుపులు ధ్వంసం!

- Advertisement -

జోగులాంబ జిల్లా గద్వాలలో పవర్ స్టార్ పవన్​కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శ్రీనివాస థియేటర్​లో ‌వేశారు. ఈ సందర్భంగా బెనిఫిట్​షోలో సినిమా బ్లర్ కావడం, సిగ్నల్ సమస్య తలెత్తింది. దీంతో అభిమానులు ఆగ్రహంతో థియేటర్ ముఖద్వారంపై దాడి చేశారు. ద్వారం పాక్షికంగా ధ్వంసమైంది.

అదే సమయంలో టికెట్లు దొరకని పలువురు థియేటర్​లోకి దూసుకురావడం వల్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. థియేటర్ యాజమాన్యం సర్ది చెప్పడంతో సమస్య సద్దు మణిగింది. అభిమానులు థియేటర్ వద్ద బాణా సంచా కాల్పులతోపాటు డప్పుల వాయిద్యంతో సందడి చేశారు.

- Advertisement -

మరోవైపు అభిమానులు కొవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి నృత్యాలు చేయడంపై ప్రజలు విస్మయానికి గురయ్యారు. క‌డ‌ప‌, తిరుప‌తిలోని ప‌లు థియేట‌ర్ల‌లోనూ అభిమానులు ఆందోళ‌న‌కు దిగారు. వ‌కీల్ సాబ్ సినిమా మ‌ళ్లీ మొదటి నుంచి ప్రారంభం కావ‌డంతో ప‌వన్ ఫ్యాన్స్ శాంతించారు.

క్వశ్చన్ పేపర్ లీక్.. అంతా అక్కడ గందరగోళం..!

అబ్బా.. తిరుపతిలో వేడి పుట్టిస్తున్న బిజేపి..!

వ్యాక్సినేషన్ ముమ్మరం చేయండి: సీఎం జగన్

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -