Thursday, May 9, 2024
- Advertisement -

పీకే రివ్యూ

- Advertisement -

బ్యానర్‌: వినోద్‌ చోప్రా ఫిలింస్‌, రాజ్‌కుమార్‌ హిరాని ఫిలింస్‌

 

తారాగణం: అమీర్‌ఖాన్‌, అనుష్క శర్మ, సంజయ్‌ దత్‌, సౌరభ్‌ శుక్లా, సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌, బొమన్‌ ఇరానీ తదితరులు

కథ, మాటలు, కథనం: రాజ్‌ కుమార్‌ హిరాని, అభిజిత్‌ జోషి

సంగీతం: అజయ్‌ అతుల్‌, శంతాను మోయిత్రా, అంకిత్‌ తివారి

ఎడిటింగ్ : రాజ్‌కుమార్‌ హిరాని

సినిమాటోగ్రఫీ : సి.కె. మురళీధరన్‌

నిర్మాతలు: విధు వినోద్‌ చోప్రా, రాజ్‌కుమార్‌ హిరాని, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌

దర్శకత్వం: రాజ్‌కుమార్‌ హిరాని

విడుదల తేదీ: డిసెంబర్‌ 19, 2014 

మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, 3 ఇడియట్స్.. ఈ మూడు సినిమాలతోనే రాజ్‌కుమార్ హిరాణి అనే దర్శకుడు దేశంలోని టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఇక లగాన్, తారే జమీన్ పర్, 3 ఇడియట్స్.. ఈ మూడు సినిమాలు చాలు, ఆమీర్ ఖాన్ అంటే ఏంటో చెప్పాలంటే. మరలాంటి ఈ ఇద్దరూ కలిసి తీసిన సినిమా 3 ఇడియట్స్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ ఇద్దరే ఒక సరికొత్త కథాంశంతో సినిమా చేయడం, ఫస్ట్‌లుక్‌తోనే విపరీతమైన క్రేజ్‌ని సంపాదించడంతో ‘పీకే’పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా ? ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మళ్ళీ ఒక అద్భుతాన్ని సృష్టించగలిగారా ? చూడండి…

కథ విషయానికొస్తే.. గ్రహాంతరవాసి అయిన ఆమీర్ ఖాన్, భూమ్మీదకొచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళలేని పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. అదే సమయంలో తాను తిరిగి వెళ్ళడానికి చేసే ప్రయాణం, ఈ ప్రయాణంలో అతను కలిసే వ్యక్తులు ఇలా సాగుతుంటుందీ కథ. ఈ క్రమంలోనే దేవుడు, దేవ ధూతలపై ఆమీర్ సంధించే ప్రశ్నలు వాటికి పరిస్థింతులెలా స్పందిచాయన్నదే సినిమా.

ఇదో కొత్త రకమైన కథాంశం. ఇటువంటి కథల్ని భారతీయ సినిమాల్లో చాలా తక్కువగా చూశామనే చెప్పాలి. వివాదాస్పదమైనదీ, సున్నితమైనదీ అయిన విషయాన్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. ఎక్కడా అసభ్యతకు కానీ, వివాదానికి కానీ తావులేకుండా అందరికీ అర్థమయ్యేలా, ప్రతీ సన్నివేశాన్నీ కొత్తగా తీయగలగడంలో వందకు రెండొందల శాతం విజయం సాధించారు. మనం ఇంతకుముందెక్కడా చూడని సన్నివేశాలను ఇందులో చూడొచ్చు. 

నటీనటుల విషయానికొస్తే.. ఆమీర్ ఖాన్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. తన సత్తా ఏంటో, ఎంతటి నటనను తన నుంచి కోరుకోగలమో అంతకు ఎక్కువ స్థాయిలోనే మనల్ని అలరిస్తాడు. ఆమీర్ చూట్టూనే తిరిగే కథలో మనమెక్కడా నిరుత్సాహపడకుండా చేయడంలో ఆమీర్.. తనకి సాటిలేరని నిరూపించాడు. అనుష్క శర్మ అందంలోనూ, అభినయంలోనూ ఆకట్టుకుంది. తనకు లభించిన ఒక అద్భుత పాత్రను అంతే అద్భుతంగా చేయడంలో అనుష్క ఆకట్టుకుంది. మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు ఆకట్టుకుంటాయ్. ఏ ఒక్క పాత్రా అవసరానికి మించి లేకుండా చేయగలగడం, ప్రతీ పాత్రకు తగిన ప్రాధాన్యత చేకూర్చడం సినిమా విజయంలో సహాయపడింది. 

పీకే పాటలన్నీ ఆడియో విడుదలతోనే ఆకట్టుకున్నాయ్. అవే పాటలను తెరపై చూసినప్పుడు, అంతకు మించి ఆకట్టుకుంటాయి. చక్కటి పాటలతో పాటు, అధ్బుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సంగీత దర్శకులు విజయం సాధించారు. మాటలు ఆకట్టుకునే ఉన్నాయ్. పాటలు వినసొంపుగా మాత్రమే కాక ఆలోచింపజేసే విధంగా చేయడంలో సాహిత్యం అధ్బుత పాత్ర పోషించింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు సినిమాను మరింత ఎత్తులో నిలబెట్టాయ్. దర్శకుడే స్వయంగా ఎడిటరవ్వడం చేత ఒక్క సన్నివేశమూ అనవసరమనిపించదు.

ఒక్క మాటలో చెప్పాలంటే.. పీకే తానేం చెప్పాలనుకుంటాడో చెప్పేసి మన మనసుల్ని దోచుకొని వెళ్ళిపోతాడు.

కథను, కళను నమ్మి.. ఒక తపస్సులా తీసే సినిమాలే చరిత్రలో గుర్తింపబడతాయ్. అలాంటి సినిమాల దర్శకులే భవిష్యత్‌కు మార్గ’దర్శకులు’ అవుతారు. అలాంటి ఒక సినిమా.. ‘పీకే’.

{youtube}82ZEDGPCkT8{/youtube}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -