- Advertisement -

‘టెంపర్’ కాంబినేషన్ రీపీట్!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘టెంప‌ర్‌’. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఫ్లాప్స్ తో స‌త‌మ‌త‌మ‌వుతున్న పూరీకి, ఎన్టీఆర్‌కీ ఈ సినిమా మంచి రిలీఫ్ ఇచ్చింది. మరో సారి ఈ కాంబినేషన్ రీపీట్ కాబోతోంది. ప్రస్తుతం పూరి కళ్యాణ్ రామ్ తో ఇజమ్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ విడుదలకు సిద్దమైయింది. సెప్టంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఒక్కంత వంశీ డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ఆ చిత్రం తర్వాత ఇంకా ఏ సినిమా కమిట్ అవ్వాలేదు.

అలాగే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో ఇజం చేస్తున్న పూరి, ఈ చిత్రం తర్వాత ఇంకో చిత్రంకు కమిట్ కాలేదు. మహేష్ తో ఓ సినిమా చేద్దాం అనుకున్నప్పటికీ అది ఇప్పట్లో కుదిరేలా లేదు. అందుకే తన తదుపరి సినిమాని ఎన్టీఆర్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు పూరి. త్వరలోనే వీరి కాంబినేషన్ పై వచ్చే కొత్త చిత్రంపై ఓ క్లారిటీ రానుంది.

Related

  1. నిత్యా మీనన్ ఎన్టీఆర్ ని అంత మాట అనేసిందేంటి?
  2. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మోహన్‌లాల్‌ సారీ చెప్పాడు! ఎందుకో తెలుసా?
  3. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  4. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -