‘అన్నాతే’ షూటింగ్ లో సూప‌ర్ స్టార్ ర‌జినీ

- Advertisement -

ఆ మ‌ధ్య కొంత కాలం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్లోనూ త‌న హ‌వాను కొన‌సాగించాల‌నుకున్నారు సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించ‌కుండానే ఇప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనికి తోడు అదే స‌మ‌యంలో ఆయ‌న అనారోగ్యానికి గురికావ‌డంతో ఆయ‌న చేస్తున్న సినిమా షూటింగ్ లు సైతం ఆగిపోయాయి.

అయితే, ప్ర‌స్తుతం ర‌జినీ ఆరోగ్యం మెరుగుప‌డ‌టంతో మ‌ళ్లీ సినిమా షూటింగ్స్ లో బిజీ అవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ప్రస్తుతం ఆయ‌న శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గ‌తేడాది డిసెంబర్ లోనే ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలోనే అనారోగ్యానికి గురికావ‌డంతో షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది.

- Advertisement -

కాగా, సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ ఆరోగ్యం పూర్తిగా మెరుగుప‌డ‌టంతో షూటింగ్‌లో పాల్గొన‌డానికి రెడీ అవుతున్నారు. అన్నాతే షూటింగ్‌ను ప్రారంభించాల‌ని సినిమా చిత్ర యూనిట్ తాజాగా చెప్పిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే నెల 15 నుంచి అన్నాతే రెగ్యుల‌ర్ షూటింగ్‌లో ర‌జినీ పాల్గొన‌నున్నారు. త్వ‌ర‌గా ఈ చిత్రాన్ని పూర్తి చేసి వ‌చ్చే న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ నాయికలుగా నటిస్తున్నారు.

సోష‌ల్ మీడియాపై కేంద్రం చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించిన విజ‌య‌శాంతి

పహిల్వాన్లతో ప‌వ‌ర్ స్టార్ ఫైట్ !

అల్లరి న‌రేష్ తో దిల్ రాజు సినిమా !

ప‌వ‌న్ సినిమాకు అలీ పెట్టుబ‌డి?

మెదడు ప‌నితీరు మెరుగు ప‌డాలంటే..

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -