Friday, May 3, 2024
- Advertisement -

రాజ్ దూత్ రివ్యూ

- Advertisement -

విలక్షణ నటుడు శ్రీహరు కుమారుడు రాజ్ దూత్ అనే సినిమా తో మన ముందుకు వస్తున్నాడు. డిస్కో శాంతి ఎంతో కష్టపడి తన కొడుక్కి మంచి సినిమా పడాలి అని ఆరాట పడి తన శాయశక్తులా ప్రయత్నించి ఈ సినిమా ని సెట్ చేసింది. హీరో కూడా ప్రమోషన్స్ తో కాస్తో కూస్తో క్రేజ్ ని తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నక్షత్ర అనే హీరోయిన్, అర్జున్-కార్తీక్ అనే దర్శకులు ఈ సినిమా తో పరిచయం అవుతున్నారు. ఈ సినిమా సమీక్ష విషయానికి వస్తే…

కథ:
సంజయ్ (మేఘంష్) ప్రియ (నక్షత్ర) అనే అమ్మాయి ని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆలోచన తో ఆ అమ్మాయి తండ్రి దగ్గరకు వెళ్లగా, సంజయ్ దగ్గర ఏమి లేదని, అలాంటి వాడికి కూతురు ని ఇచ్చి ఎలా పెళ్లి చేయాలని చులకనగా మాట్లాడతాడు. అప్పుడే సంజయ్ కి ఒక కండీషన్ కూడా పెడతాడు. అసలు ఆ కండీషన్ ఏంటి? అప్పుడు సంజయ్ ఏం చేశాడు? చివరికి ఇద్దరూ ఒకటయ్యారా? అనేది సినిమా కథ.

నటీనటులు:
శ్రీహరి తనయుడిగా మేఘంష్ కి సినిమా వాతావరణం కొత్త కాకపోవచ్చు కానీ కెమెరా మరియు నటన మాత్రం చాలా కొత్త. అయినప్పటికీ ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచాడు మేఘంష్. తన తండ్రి పేరు నిలబెట్టేలాగా, రియల్ స్టార్ తనయుడిగా తండ్రి టాలెంట్ ని పుణికి పుచ్చుకున్నాడు మేఘంష్. నక్షత్ర తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. కేవలం తన అందంతో మాత్రమే కాక అద్భుతమైన నటనతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆదిత్య మీనన్ కు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. అంతేకాకుండా అతను తన పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా నటించారు. ఎప్పటిలాగానే తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో రవి వర్మ బాగా అలరిస్తారు. సుదర్శన్ కామెడీ కూడా సినిమాకు చాలా బాగా హెల్ప్ అయింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం:
అర్జున్ గున్నాల మరియు కార్తిక్ ఇద్దరూ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. వారిద్దరి మధ్య కోఆర్డినేషన్ చాలా బాగుంటుందని సినిమా చూస్తేనే అర్థమవుతుంది. రాజ్ దూత్ సినిమా కోసం ఒక మంచి కథను సిద్ధం చేసుకున్న వీరు ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా కథను నెరేట్ చేయలేకపోయారు. ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్ లు కూడా జత చేసి సినిమాని చాలా బాగా రూపొందించే ప్రయత్నం చేశారు అర్జున్ మరియు కార్తిక్. ఎం ఎల్ వి సత్యనారాయణ అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి. క్వాలిటీ పరంగా నిర్మాత ఏమాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది. వరుణ్ సునీల్ అందించిన మ్యూజిక్ బాగుంది. పాటలు అంతగా మెప్పించలేకపోయినప్పటికి వరుణ్ సునీల్ అందించిన నేపథ్య సంగీతం మాత్రం సినిమాకి బాగా సెట్ అయింది. సినిమాటోగ్రాఫర్ విద్యాసాగర్ చింత ఈ సినిమా కోసం అందమైన విజువల్స్ ను అందించారు. విజయ్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:
సినిమా మొత్తం ‘రాజ్ దూత్’ అనే బండి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొత్త వాడయినప్పటికీ మేఘంష్ ఈ సినిమాలో చాలా బాగా నటించటం సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. కథ అంత బలంగా లేకపోయినప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఆసక్తికరంగా ఉండటం లో విఫలమైంది. సినిమా లోని రెండవ హాఫ్ తో పోలిస్తే మొదటి హాఫ్ లో కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ బాగా ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు కథతో ఈజీగా కనెక్ట్ అయిపోతారు. కానీ రెండో భాగం మెప్పించే విధంగా లేకపోవడం తో నిరాశే మిగులుతుంది. సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. ఒకవైపు కామెడీ నీ మరియు ఎంటర్టైన్మెంట్ పై దృష్టి పెట్టిన దర్శకులు మరోవైపు ఎమోషన్ల ను కూడా చాలా బాగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. కానీ సినిమాను ఎంగేజింగ్ గా చేయడం లో మాత్రం విఫలమయ్యారు. చివరిగా ‘రాజు దూత్’ ఒకసారి టైం పాస్ కి చూడొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -