టాలీవుడ్ లో మళ్ళీ డ్రగ్స్ కలకలం రేగనుందా..?

- Advertisement -

సుశాంత్ సూసైడ్ కేస్ కాస్తా ఇప్పుడు డ్రగ్స్ కేస్ గా మారిపోయింది. రియా చక్రవర్తి పలువురి పేర్లను బయటపెడుతూ ఈ కేసుతో ముడిపడి ఉన్న అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఈ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, తెలుగులో పలు చిత్రాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్, నటుడు రణ్‌వీర్ సింగ్ సన్నిహితురాలు, డిజైనర్ సిమోన్ ఖంబట్ట పేర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

విచారణలో భాగంగా రియా చక్రవర్తి వీరి పేర్లను వెల్లడించినట్టు తెలుస్తోంది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) వీరిపై నిఘా పెట్టినట్టు సమాచారం. వీరితోపాటు బాలీవుడ్‌లోని పలువురిపై ఇప్పుడు ఎన్‌సీబీ నిఘాపెట్టినట్టు ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. విచారణలో భాగంగా రియా చక్రవర్తి ప్రత్యేకంగా పై పేర్లను వెల్లడించినట్టు టైమ్స్ నౌ తన కథనంలో పేర్కొంది. కాగా, తాను మాదకద్రవ్యాలు తీసుకోనని తొలుత చెప్పిన రియా.. ఆ తర్వాత తాను కూడా డ్రగ్స్ తీసుకుంటానని విచారణలో అంగీకరించినట్టు సమాచారం.

- Advertisement -

ఈ మేరకు సదరు నటీనటులను త్వరలోనే విచారించనున్నట్లు సమాచారం. కాగా, సెప్టెంబర్‌ 8 నార్కోటిక్స్‌ కేసులో అరెస్టయిన రియా, ఆమె సోదరుడు షోవిక్‌ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -