వర్మ ‘పవర్ స్టార్’ సినిమా హీరో దొరికేశాడు..!

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ ఈ కరోనా సమయంలో కూడా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలకు సెన్సార్ అక్కర్లేదు క్వాలిటీ విషయంలో పట్టింపు లేదు. కనుక నెలలోపే సినిమాను పూర్తి చేస్తున్నారు. క్లైమాక్స్, ఎన్ఎన్ఎన్ సినిమాలను అతి తక్కువ టైంలో పూర్తి చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మర్డర్ మూవీతో పాటు పవర్ స్టార్ సినిమాలను తెరకెక్కించేందుకు సిద్దంగా ఉన్నాడు. మర్డర్ సినిమాని షూటింగ్ మొదలు పెట్టగా పవర్ స్టార్ సినిమాను త్వరలో ప్రారంభిస్తాడట.

వర్మ తన సినిమాలోని పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకునే విధంగా నిజంగా జీనియస్ అంటూ ఆయన అభిమానులు అంటూ ఉంటారు. తాజాగా పవర్ స్టార్ సినిమాను ప్రకటించిన వర్మ అందులో ముఖ్య పాత్రకు నటించబోతున్న నటుడిని కూడా పరిచయం చేశాడు. ఒక వీడియోను పోస్ట్ చేసి పవర్ స్టార్ మా ఆఫీస్ కు వచ్చి వెళ్తున్నాడు అంటూ ట్వీట్ చేశాడు. ఆ వీడియోలో సేమ్ పవన్ లానే ఉన్న వ్యక్తి గురించి నేటిజన్స్ చర్చించుకుంటున్నారు. వర్మ అతడిని టిక్ టాక్ లో దొరికించుకున్నాడట.

- Advertisement -

భద్రాచలంకు చెందిన నరేష్ అనే ఆ వ్యక్తి హైదరాబాద్ లో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వర్మ స్వయంగా కారు పంపించి మరి అతడిని ఆఫీస్ కు రప్పించుకున్నాడు. పవర్ స్టార్ సినిమాలో నటించాల్సిందిగా అడిగిన సమయంలో మొదట నరేష్ ఒప్పుకోలేదట. ఆ తర్వాత వర్మ చెప్పిన మాటలతో కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పవర్ స్టార్ ను సెట్ చేసిన వర్మ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నాడు.

సునీల్ గారు ఎక్కిన రిక్షాని లాక్కొచ్చాను : హైపర్ ఆది

దొరబాబు సెక్స్ రాకెట్.. మళ్లీ బయటపెట్టిన హైపర్ ఆది..!

నేను కూడా చనిపోదాం అనుకున్నా : నందినీ రాయ్

గంగోత్రి హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -