కర్నూల్ లో పడగవిప్పిన పాతకక్షలు.. వేట కొడవళ్లతో నరికి అన్నదమ్ముల దారుణ హత్య..

- Advertisement -

గత కొంత కాలంగా కర్నూల్ లో ఫ్యాక్షన్ గొడవలు తగ్గిపోయాయని అందరూ భావిస్తున్న సమయంలో.. కర్నూల్ లో ఫ్యాక్షన్ పడగవిప్పింది. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు ప్రత్యర్థులు. అడ్డు వచ్చిన మరికొందరి కార్యకర్తలపై, వారి అనుచరులపైనా విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.

మృతులను మాజీ సర్పంచ్ ఒడ్డు నాగేశ్వరరెడ్డి, అతడి తమ్ముడు వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డిగా గుర్తించారు. ఇద్దరూ టీడీపీ నాయకులు. మూడు రోజుల క్రితం చనిపోయిన సమీప బంధువు సమాధి వద్దకు వెళ్తుండగా నిందితులు వారిని బొలేరో వాహనంతో ఢీకొట్టారు. అనంతరం వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ దాడిలో ఇద్దరు అన్నదమ్ములు కన్నుమూశారు.

- Advertisement -

క్షతగాత్రులను స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వీరి హత్యకు పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

కేసీఆర్​ ఫామ్​హౌస్​ ఎక్కడో కూడా తెలియదు..!

నా శ్రీదేవి అంటూ హరీష్ శంకర్ షాకింగ్ ట్విట్..?

కరోనాతో సినీ నటి కవిత కొడుకు కన్నుమూత

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -