షూటింగ్‌లో గాయపడిన రవితేజ

- Advertisement -

మాస్ మహారాజ రవితేజ డెడికేషన్ చూసి అభిమానులు ఔరా అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రవితేజ షూటింగ్‌లో గాయపడిన విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఓ యాక్షన్ సీన్ చేస్తూ రవితేజ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కుట్లు కూడా పడ్డాయంటున్నారు. దాంతో రెండ్రోజుల పాటు రెస్ట్ తీసుకున్న రవితేజ మళ్లీ షూటింగ్‌కు సిద్ధమైపోయాడు. ఈ సినిమా ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో గ్యాప్ తీసుకోకుండా యాక్షన్ సీన్స్ పూర్తి చేయాలని భావిస్తున్నాడట.

- Advertisement -

స్టువర్ట్ పురం దొంగ జీవితగాథ ఆధారంగా ఈ సినిమా తీసుకుంటున్నారు. మొత్తమ్మీద రవితేజ అంకిత భావం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

సలార్ మూవీపై క్రేజీ అప్‌డేట్

భారీ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న కన్నడ భామ

ప్రభాస్ ఫ్యాన్స్‌ను వణికిస్తున్న సెంటిమెంట్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -