విజయ్ దేవరకొండ లైనప్ మామూలుగా లేదు.. లైన్లో నలుగురు టాప్ డైరెక్టర్లు..!

- Advertisement -

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీ వాలా వంటి వరుస సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. యూత్లో ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. అయితే అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలు సూపర్ హిట్ అయిన ప్పటికీ విజయ్ వెంటనే అగ్ర దర్శకులతో సినిమాలు చేయలేకపోయాడు. దీనికి కారణం ముందుగా ఒప్పుకున్న సినిమాలే. ఆ సినిమాల వల్ల విజయ్ కి ప్లాప్ లే మిగిలాయి.

వరుస విజయాల తర్వాత విజయ్ చేసిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ముందుగా చేసుకున్న కమిట్మెంట్స్ పూర్తి చేసుకోవడంతో విజయ్ ఫ్రీ అయ్యారు. ఇప్పుడు వరుసగా అగ్ర దర్శకులను లైన్లో పెడుతున్నాడు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో టాప్ డైరెక్టర్ సుకుమార్ తో విజయ్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఇది రెండు పార్టులుగా రానుంది. ఈ మూవీ పూర్తయిన తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా ప్రారంభించనున్నాడు.

- Advertisement -

అలాగే విజయ్ దేవరకొండ కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ తర్వాత ఎన్టీఆర్ తో మరో సినిమా చేయనున్నాడు. ఇది పూర్తయిన తర్వాత విజయ్ తో సినిమా ఉంటుందని టాక్. ఈ ఇద్దరు అగ్ర దర్శకుల తో పాటు మాస్ చిత్రాల డైరెక్టర్లు బోయపాటి శ్రీను, హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ ఓకే చెప్పినట్లు సమాచారం. ముందుగా విజయ్ కి అగ్ర దర్శకులతో సినిమాలు చేసే అవకాశం రాకపోయినప్పటికీ ఇప్పుడు మాత్రం వరుసగా టాప్ డైరెక్టర్లు లైన్ లో పెడుతున్నాడు.

Also Read : ఆర్ఆర్ఆర్ కు పోటీగా అఖండ.. రిస్క్ వద్దంటున్న అభిమానులు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -