ధనుష్, ఐశ్వర్యల విడాకులు అందుకేనా..?

- Advertisement -

తమిళ సూపర్ స్టార్ ధనుష్ మరుయు సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యలది పరిచయం అవసరం లేని జంట. ధనుష్ ఒక సాదారణ హీరో గా ఉన్నపుడే ఐశ్వర్యతొ ప్రేమలో పడ్డాడు. రజినీకాంత్ కూడా అతనిలోని మంచితనం ఇంకా టాలెంట్ చూసి పెళ్ళికి ఓకే చెప్పి, అల్లుడ్ని చేస్కున్నాడు.వీరిద్దరికి పెళ్ళయి దాదాపు 18 ఏళ్ళయింది. ఇంతకాలం తర్వాత వీళ్ళు విడాకులు ప్రకటించటం అందర్నీ షాక్ కి గురిచేసింది. ధనుష్ తన ట్విట్టర్ అకౌంట్లో దీనికి సంబంధి౦చిన ట్వీట్ చేసాడు. “ఇది పరస్పర అంగీకారం తోటే తీస్కున్న నిర్ణయం , ఇకనుంచి వ్యక్తులుగా ఒకర్నొకరం అర్ధం చేస్కోటానికి ప్రయత్నిస్తాం , దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించి మాకు ప్రైవసీని ఇవ్వండి “అని తన ఫాన్స్ ను కోరాడు.

వీరిద్దరి విడాకులకి ముఖ్య కారణం ధనుష్ వర్కోహోలిక్ నేచరట. ధనుష్ చాలా బిజీ నటుడని మనందరికీ తెలుసు. అటు తమిళ్ మాత్రమే కాకుండా ఇటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్నాడు. ఒక సంవత్సరానికి కనీసం మూడు సినిమాలైన చేస్తాడు. అంతేకాకుండా రైటర్ గా ,సింగర్ గా ఇంకా ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నాడు. ఇంత బిజీగా ఉండే ధనుష్ ఇంటికి సరైన సమయాన్ని కేటాయించలేక పోతున్నాడట. ఒక తండ్రిగా పిల్లలపట్ల తన బాధ్యతను నిర్వహించటంలో విఫలం అయ్యాడట. అది మాత్రమే కాదు తన భార్య ఐశ్వర్య తొ కూడా సమయాన్ని గడపడం లేదట. దినివల్లె చాలా మూవీస్ లో తనను ఇన్వాల్వ్ చేసాడంట. కనీసం అలా అయినా తన భార్యతో సమయాన్ని గడపొచ్చని. దాదాపు ఆరు నెలలు అలోచించి వీరిద్దరూ విడిపోదామని నిర్ణయించుకునారట. పిల్లల బాధ్యతను ఇద్దరూ తిస్కోబోతునట్లు తెలియజేసారు.

- Advertisement -

అయితే దీనికి మరొక కోణం ఉంది. ఇది కేవలం పైకి వినబడుతున్న కారణమేనట. అసలు కథ వేరే ఉందని తమిళ ఇండస్ట్రీ వర్గాలు పెదవి కొరుకుతున్నాయి. ఈ విడాకులకు బీజం దాదాపు నాలుగు ఏళ్ళ క్రితమే పడిందట. కొన్నేళ్ళ క్రితం శుచీ లీక్స్ తమిళ ఇండస్ట్రీ లో లేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఎంతోమంది సెలబ్రిటీస్ కి చెప్పుకింద మేకులా తయారైంది. వారి పర్సనల్ లైఫ్ లోని ఇంటిమేట్ వీడియోస్ ని లీక్ చేస్తూ శుచీ లీక్స్ ఓవర్నైట్ క్రేజ్ సంపాదించిందిన విషయం తెల్సిందే. అయితే అవన్ని ఫేక్ వీడియోస్ అని ఎంతో మంది సెలబ్రిటీస్ కొట్టిపడేసినప్పటికి , అందులో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదని చాల మంది సినిపెద్దలు చెప్పారు. అలాంటి శుచీ లీక్స్ లో ధనుష్ వీడియో రావటం ,ఐశ్వర్య లో ఎంతో కొంత అనుమానాన్ని కలగజేసివుండవొచ్చని,అదీకాక విఐపి -2 సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ టాపిక్ మీద అడిగిన ప్రశ్నకు ధనుష్ చాలా ఇబ్బంది పడటం ,ఎపుడూ లేని విదంగా సీరియస్ అయి ఇంటర్వ్యూ నుంచి వాకౌట్ చేయటం అనుమానాలను నిజం చేసినట్లైంది. ధనుష్ పైకి కనిపించేంత అమాయకుడు కాదట. అతను పర్సనల్ లైఫ్ ను చాలా సీక్రెట్ ఉంచుతాడట. నైట్ పార్టీస్ కూడా వెళ్తుంటాడు.ఫ్యామిలీ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోగా తనతో నిజాయితీగా లేడు అని ఐశ్వర్య ఫీల్ అవ్వటం వీరి విడాకులకు అసలు కారణం అని తమిళ తంబీలు గుస గుస లాడుతున్నారు. ఏదేమైనా 18 ఏళ్ళు కలిసుండి విడిపోవటం ధనుష్ ఫాన్స్ కి చాలా బాధను కలిగిస్తుంది, వారు సోషల్ మీడియాలో వాళ్ళ సపోర్ట్ ని ధనుష్ కి తెలియచేస్తున్నారు .

చిరు చిన్న కూతురు మళ్ళీ విడాకులు..?

సమంత ఎలా ఊ.. అందో తెలుసా?

ఢీ నుంచి సుధీర్, రష్మి అవుట్..కారణం అదేనా

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -