Thursday, May 23, 2024
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ మూవీ రివ్యూ

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమా త‌రువాత చిన్న సినిమాలు హావా పెరిగిందనే చెప్పాలి.అర్జున్ రెడ్డి త‌ర‌హాలోనే టీజ‌ర్‌తో ఆక‌ట్టుకున్న సినిమా ఆర్ఎక్స్ 100.సినిమా టైటిల్‌తోనే యూత్‌ను ఆక‌ట్ట‌కుంది.ఇక ఈ సినిమా టైటిల్ తో పాటు పోస్టర్లు, ట్రైలర్లు డిఫరెంట్ గా ఉండటంతో.. సినిమాపై అంచనాలు ఏర్పడింది. బోల్డ్ సన్నివేశాలు బోలెడు ఉంటాయని ముందుగానే ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చింది యూనిట్. ఈ సినిమా ఈరోజు (శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.మ‌రి ఈ సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం.

కథ : చిన్నతనంలోనే హీరో కార్తికేయ తల్లిదండ్రులను కోల్పోతాడు. దీంతో రాంకీ అన్ని తానై కార్తికేయను పెంచుతాడు. తండ్రికన్నా మిన్నగా పెంచడంతో.. అతనిపై ప్రేమ కలుగుతుంది. తండ్రికి సహాయ సహకారాలు అందిస్తూనే.. అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. కొన్ని కారణాల వలన రాంకీ, రావు రమేష్ ల మధ్య గొడవలు జరుగుతాయి. ఇదే సమయంలో కార్తికేయ, రావు రమేష్ కూతురు పాయల్ ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇద్దరు ఘాడంగా ప్రేమించుకుంటారు. రాంకీ సపోర్ట్ చేయడంతో వీరి ప్రేమ పీక్స్ కు వెళ్తుంది. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తానని వెళ్లిన పాయల్, వేరే వ్యక్తిని వివాహం చేసుకొని ఫారెన్ వెళ్ళిపోతుంది. పాయల్ ను దూరం చేసిన రావు రమేష్ పై కోపం పెంచుకుంటాడు కార్తికేయ. సైకోలా మారిపోతాడు. కార్తికేయను కాదని పాయల్ వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది..? విదేశాలకు వెళ్లిన పాయల్ తిరిగి వచ్చిందా..? చివరకు కార్తికేయ ఏమయ్యాడు అన్నది మిగతా కథ.

విశ్లేషణ : రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి అర్జున్ రెడ్డి సినిమాను దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాసుకున్నాడు. కథ బాగున్నా దానిని తెరపైన చూపించే విధానంలో ఫెయిల్ అయ్యాడు. టైటిల్ కు సినిమాకు సంబంధం ఏంటో తెలియలేదు. హీరో, హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ ఆసక్తికరంగా అనిపించలేదు. పదేపదే ముద్దు సీన్స్ చూపిస్తూ.. సన్నివేశాలను బోల్డ్ గా చూపించాలని అనుకున్నాడు దర్శకుడు. అంతేకాదు, పదునైన కథనాలు లేకపోవడంతో.. మరీ సాగదీసినట్టుగా ఉండటం.. ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారింది. ఈ సినిమాలో ఏవైనా ఆసక్తి కరంగా ఉన్నాయి అంటే అది ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రమే. సంగీతం బాగున్నా.. నేపధ్య సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. విజువలైజేషన్ బాగుంది. ,కథతో సంబంధంలేని విషయాలు ఎక్కువగా వచ్చిపోతుంటడంతో.. సినిమా సైడ్ ట్రాక్ మీదకు వెళ్లి బోర్ కొట్టించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు : హీరో కొత్తవాడైన తన పాత్రకు తగిన న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. నిజాయితీ కలిగిన ప్రేమికుడిగా, ప్రేమ విఫలమైన ప్రేమికుడిగా రెండు వేరియేషన్స్ లో బాగా కనిపించాడు. క్లైమాక్స్ లో కార్తికేయ నటన బాగుంది. పాయల్ రాజ్ పుత్ అందంగా కనిపించింది. బోల్డ్ సన్నివేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నటించింది. రావు రమేష్ మరోసారి మెప్పించాడు. రాంకీ పాత్రను ఇంకొంచెం ఎలివేట్ చేసుంటే బాగుండేది.

బోట‌మ్ లైన్ : ప్ర‌తి సినిమా అర్జున్ రెడ్డిలా ఉండ‌లంటే క‌ష్ట‌మే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -