తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన నటుడు నరేష్!

- Advertisement -

తెలుగు సినీ ఇండస్ట్రీలో వైవిద్యభరిత చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నరేశ్. నాలుగు దశాబ్దాలుగా తన మార్క్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్నారు. ప్రముఖ నటి, దర్శక, నిర్మాత దివంగత విజయనిర్మల తనయుడు నరేశ్. ప్రస్తుతం ఆయన తండ్రి పాత్రలలో కనిపిస్తూ మెప్పిస్తున్నారు. సినీమాలతో బీజీగా గడుపుతూనే అదే సమయంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. సాధార‌ణంగా వ్యాపార ఒప్పందాల విష‌యంలో మోసాలు జ‌రుగ‌డం చూస్తుంటాం. కానీ సెల‌బ్రిటీల విష‌యంలో ఇలాంటివి జరిగితే ప‌బ్లిక్ అటెన్ష‌న్ పెరుగుతుంది.

కీస్టోన్ అనే కంపెనీని నడుపుతున్న లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి.. తమ కటుంబంతో ఉన్న పరిచయాన్ని అడ్డంపెట్టుకొని ఏడున్నర కోట్లు అప్పుగా తీసుకున్నాడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత ఆరు సంవత్సరాలుగా డబ్బు అడిగితే ఏదో ఒక సాకు చెబుతూ.. తప్పించుకుని తిరుగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని నరేష్ పోలీసులకు తెలిపారు. ఏడున్నర కోట్లకు వడ్డీతో కలిపితే తనకు దాదాపు 10 కోట్లు రావాలని ఆయన అన్నారు. కాగా.. ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తనకు న్యాయం జరిగేలా చూస్తారని నమ్మకముందని ఆయన అన్నారు.

మోత్కుపల్లి ఆరోగ్యం సీరియస్.. రాష్ట్రం కుడా సీరియస్..!

అంతా అబద్ధం.. నేను చెప్పింది నమ్మండి అంటున్న ఈటల..!

కరోనా వచ్చాక పవన్ కళ్యాణ్ సూక్తులు విన్నారా..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -