- Advertisement -

కాలేజీ సమయంలో రెండు సార్లు ప్రేమలో విఫలం అయ్యా… శాలినీ పాండే

- Advertisement -

గత సంవత్సరం ఆగస్టులో విడుదల అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో వివరించనక్కర్లేదు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనిపించుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్స్‌ను రాబట్టింది ఈ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన శాలినీ పాండే కొన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

‘అర్జున్ రెడ్డిస సినిమా శాలినీ పాండేకు ఎంత‌టి పేరు తెచ్చిపెట్టిందో తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో తాను నరకయాతన అనుభవించానని చెప్పింది. ఓ తమిళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన శాలిని, గతంలో తాను కాలేజీ విద్యను అభ్యసిస్తున్నప్పుడు రెండుసార్లు ప్రేమలో పడి విఫలం అయ్యానని, ‘అర్జున్ రెడ్డి’ షూటింగ్ సమయంలో ప్రేమ వైఫల్యంలో ఉన్న తాను హీరోతో సన్నిహిత సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది.

ఆ సమయంలో తనకు ఇబ్బందిగా అనిపిస్తూ, నరకయాతనగా ఉండేదని, అంత బాధలోనే షూటింగ్ ను పూర్తి చేశానని చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లో అవకాశాల కోసం తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చానని చెప్పిన శాలిని, ముంబైలో తాను పడ్డ అద్దె ఇంటి కష్టాలనూ తెలిపింది. ముంబైలో ఒంటరిగా ఉండే వారికి ఇల్లు ఇవ్వరని, తనతో కలసి మరో అమ్మాయి, ఇంకో ఇద్దరు అబ్బాయిలు కలసి ఓ ఇంట్లో అద్దెకున్నామని, వారు తనతో ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -