- Advertisement -

శ్రీదేవీ మ‌ర‌ణ స‌మ‌యంలో లేని పెద్ద కూతురు

- Advertisement -

దుబాయ్‌లో జ‌రిగిన ఓ పెళ్లికి శ్రీదేవి కుటుంబ‌స‌భ్యుల‌తో స‌హా హాజ‌ర‌య్యారు. వివాహ వేడుక‌ల్లో ఉత్సాహంగా పాల్గొన్న శ్రీదేవీ అక‌స్మాత్తుగా శ‌నివారం అర్థ‌రాత్రి గుండెపోటుకు గుర‌యి మృత్యువాత ప‌డ్డారు. సినీ న‌టి శ్రీదేవి మ‌ర‌ణించారని వార్త ఆదివారం ఉద‌యం అంద‌రికీ తెలిసి షాక్‌కు గుర‌య్యారు. యావ‌త్ సినీ లోకాన్ని దిగ్ర్భాంతికి గురి చేసిన ఆమె మ‌ర‌ణం ఎవ‌రికీ తీర్చ‌లేనిది. ఆమె ఎన్నో సినిమాలు చేసి ప్రేక్ష‌కాభిమానాన్ని పొందారు.

అయితే ఆమె మ‌ర‌ణ స‌మ‌యంలో పెద్ద కూతురు జాన్వీ లేదు. జాన్వీ ఎక్క‌డా పోయింది.. ఏం చేస్తోంది..? అని స‌ర్వ‌త్రా ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. దుబాయ్‌లో జ‌రిగిన పెళ్లికి భ‌ర్త బోని క‌పూర్‌, చిన్నఖుషీ వెంట ఉన్నారు. కానీ పెద్ద కూతురు జాన్వీ లేదు. ఎందుకంటే జాన్వీ ప్ర‌స్తుతం ఓ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆమెను సినీ ప‌రిశ్ర‌మ‌కు పరిచయం చేద్దామ‌ని శ్రీదేవి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా జాన్వీ ఓ సినిమా ఫైన‌లైజ్ చేసి ప్ర‌స్తుతం షూటింగ్‌లో పాల్గొంటోంది. అందుకే జాన్వీని దుబాయ్‌కు తీసుకెళ్ల‌లేదు.

మరాఠీ బ్లాక్ బస్టర్ ‘సైరాట్’ రీమేక్ ద్వారా జాన్వీ న‌టిస్తుండ‌గా ప్ర‌స్తుతం ‘ధడక్’ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ షూటింగ్‌ ఉండ‌డంతో జాన్వీ భార‌త్‌లోనే ఉండిపోయింది. త‌ల్లి మ‌ర‌ణ స‌మ‌యంలో తాను లేక‌పోవ‌డంపై జాన్వీ క‌న్నీరుమున్నీర‌వుతోంది. త‌నను సినిమాలో హీరోయిన్‌గా థియేట‌ర్‌లో చూడ‌కుండానే త‌న త‌ల్లి వెళ్లిపోవ‌డంపై జాన్వీ దుఃఖిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -