Saturday, April 27, 2024
- Advertisement -

సారీ భ‌య్యా.. పెళ్ల‌య్యింది.. రాజకీయాల‌కు నేను ప‌నికిరాను

- Advertisement -

రాజ‌కీయాల్లోకి వ‌స్తారా… అని హీరో సూర్య త‌మ్ముడు, న‌టుడు కార్తీని అడిగితే భిన్నంగా స‌మాధానం చెప్పాడు. తన‌కు పెళ్ల‌య్యింది.. రాజ‌కీయాల‌కు తాను ప‌నికి రాను అని ప్ర‌క‌టించాడు. విశాల్‌కు పెళ్లి కాలేదు క‌దా.. ఆయ‌న రాజ‌కీయాలకు ప‌నికొస్తాడు అని పేర్కొన్నాడు.

త‌మిళ‌నాడులో సినీనటులు రాజకీయాల్లోకి వ‌రుస‌గా వ‌స్తున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ త‌దిత‌రులు రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. పెద్ద పెద్ద హీరోలు రాజ‌కీయాల్లోకి వ‌స్తుండ‌డంతో ఇప్పుడు ఏ హీరో, న‌టుడు క‌నిపించినా మీరు రాజ‌కీయాల్లోకి వెళ్తున్నారా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే ప్ర‌శ్న హీరో కార్తీని అడ‌గ‌డంతో అత‌డు పై విధంగా స‌మాధానం ఇచ్చాడు.

రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు. మైండ్ మొత్తం దానిపైనే పెట్టాలి. సినిమాలన్నీ వదిలేయాలి. రోజులో కనీసం 22 గంటలు దానికే కేటాయించాలి. బ్యాచిలర్స్‌కు రాజకీయాలు సూట‌వుతాయ‌ని చెప్పాడు. ఇంకో మాట అంటూ విశాల్ లాంటి బ్యాచిలర్ అయితే రాజ‌కీయాల‌కు బాగా పనికి వస్తాడు అని చెప్పాడు. త‌న‌కు పెళ్లయింది, నేను పనికిరాను అంటూ సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఎంతోకొంత మంచి చేయాలనుకున్నప్పుడు రాజకీయాల్లోకే రావాల్సిన అవసరం లేదు, మేము ప్రస్తుతం పబ్లిక్‌లో ఉన్నాం.

మాకు ఈ జీవితం ఇచ్చింది పబ్లిక్. అలాంటి వాళ్ల కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. సంపాదించినది కొంతయినా తిరిగి వాళ్లకు చేరాలి. నేను ఎన్నో సహాయకార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. రాజకీయాల్లోకి వస్తేనే చేయగలం అనుకుంటే పొరపాటు. కాకపోతే పాలిటిక్స్ లోకి వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చు అని ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -