టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతా : తలసాని శ్రీనివాస్

- Advertisement -

తెలుగు సినిమా రంగం దేశానికే ఒక పారిశ్రామిక హబ్ గా ఉండాలని తాము భావిస్తున్నామని , ఈరంగంపై ఆధారపడి ఎంతో మంది జీవనం కొనసాగిస్తున్నారని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సినిమా రంగం బాగుండాలనే ఉద్దేశంతోనే తెలంగాణలొ కొత్త సినిమాలకు ఐదు షోలకు అనుమతి ఇచ్చామని అన్నారు. అలాగే సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు.

తెలంగాణలో సినిమా ఇండస్ట్రీపై ఎటువంటి బలవంతపు నిర్ణయాలను రుద్దబోమని స్పష్టం చేశారు. చిన్న సినిమాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. సినిమా రంగానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

- Advertisement -

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లపై తలసాని స్పందించారు. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుదలకు అనుమతి ఇచ్చిన విధంగానే ఏపీలోనూ ఇవ్వాలని అభిప్రాయ పడ్డారు. అవసరం అయితే ఈ విషయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

సిద్ధార్థ పశ్చాత్తాపం.. సారీ చెప్పిన హీరో

బాలయ్య దుమ్ము దుమారం

సమంత ఎలా ఊ.. అందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -