నైటీ ఎందుకు వేసుకుంటావు : హీరో ప్రశ్నపై దీపిక జవాబు ఇదే..!

- Advertisement -

కరోనా వైరస్ కారణంగా అన్ని బంద్ అయిపోయాయి. ఇక ఈ టైంలో సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రధానంగా అభిమాన హీరోలు – హీరోయిన్ల విషయాల కోసమైతే తెగ ఆరాటపడిపోతుంటారు.

అలాంటి ఒక ఇన్సిడెంట్ బాలీవుడ్ తారలు దీపిక పదుకోనె – యంగ్ హీరో వరుణ్ ధావన్ ల మధ్య చాటింగ్ రూపంలో జరిగింది. జనతా కర్ఫ్యూ సందర్బంగా ఇంట్లో ఉండిపోయిన సెలబ్రిటీలంతా ఇళ్లను చక్కబెట్టుకొనే పనిలో పడ్డారు. ఇక దీపిక పదుకోనె – వరుణ్ ధావన్ లు ఇంటి పనులతో పాటు వాట్స్ యాప్ లో చాటింగ్ కూడా చేశారట. చాటింగ్ లో భాగంగా వరుణ్ ధావన్ – దీపికకు కొన్ని చిలిపి ప్రశ్నలను సంధించాడు. ఏం చేస్తున్నావ్? అంటే చాలాకాలం తర్వాత కర్ఫ్యూ రూపంలో ఖాళీ టైం దొరికింది కదా.. నా బీరువాలో బట్టలు సర్దుకుంటున్నా అని చెప్పిందట.

- Advertisement -

ఆ వెంటనే వరుణ్.. చిలిపిగా.. నువ్వెప్పుడూ నైట్ డ్రెస్ లోనే ఉంటావ్ ఎందుకని? అన్నాడట. దానికి బదులుగా.. నాకు నైట్ డ్రెస్ లో ఉండటమే చాలా ఇష్టం. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఎనీటైమ్ ఏ పనైనా చేయొచ్చు.. అంటూ మరింత చిలిపిగా జవాబిచ్చిందట. ఇదేంటి వీళ్లు ఇలా మాట్లాడుకున్నారు అనుకుంటే పొరపాటే.. వాళ్ళిద్దరి మధ్య స్నేహం అలాంటిది మరి. కలిసి నటించకపోయినా మా మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందంటున్నారు. వీరి చాటింగ్ చూసి ఫ్యాన్స్ సూపర్ క్యూట్ అంటూ నవ్వుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -