నారప్ప నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది..!

- Advertisement -

వరుస విజయాలతో దూసుకెళ్తున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మరో ప్రయోగాత్మక సినిమా అయిన నారప్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకీ సరసన ప్రియమణి నటిస్తుండగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సురేష్ బాబు, కలై పులి థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాకు నారప్ప రీమేక్. అసురన్ మూవీ తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో హీరోగా నటించిన ధనుష్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా కథ నచ్చడంతో వెంకటేష్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగల్ చలాకీ చిన్నమ్మి పాట ఇప్పటికే విడుదలవ్వగా, ఇవాళ మీ సినిమా నుంచి మరో పాట విడుదలైంది.

‘ఓ నారప్ప నువ్వంటే ఎంతో ఇట్టం గుంది నారప్ప’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటలో వెంకీ యువకుడిలా కనిపిస్తున్నారు. ఓ నారప్ప సాంగ్ కి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాట ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. కాగా నారప్ప సినిమాను ఈనెల 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -