Saturday, April 27, 2024
- Advertisement -

కర్ణాటక ఉపసభాపతి ధర్మె గౌడ ఆత్మహత్య..!

- Advertisement -

కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మె గౌడ బలవన్మరణానికి పాల్పడ్డారు. చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలుకా గుణసాగర్​ సమీపంలోని ఓ రైల్వే ట్రాక్​పై ఆత్మహత్య చేసుకున్నారు.సోమవారం సాయంత్రం ధర్మె గౌడ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే గన్​మెన్, పోలీసులు ఆయన కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. మంగళవారం ఉదయం ధర్మె గౌడ మృతదేహం రైల్వే ట్రాక్​పై కనిపించింది. సమీపంలో దొరికిన సూసైడ్​ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉపసభాపతి అకాల మరణంపై మాజీ ప్రధాని దేవెగౌడ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ధర్మె గౌడ ప్రశాంతమైన వ్యక్తి అని.. రాష్ట్రం ఓ మంచి నేతను కోల్పోయిందని పేర్కొన్నారు.  ధర్మెగౌడ ఆత్మహత్య విషయం తెలిసి మాజీ ప్రధాని దేవెగౌడ, జేడీఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు.

డిసెంబర్ 15న కర్ణాటక విధాన పరిషత్(మండలి) సమావేశాల్లో గందరగోళం జరిగింది. ఛైర్మన్ కే ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యులు వాగ్వాదాలకు దిగారు. మాటల దాడులతో పాటు ఒకరినొకరు తోసివేసుకున్నారు. సభాపతి స్థానంలో ఉన్న ధర్మె గౌడను ఛైర్మన్ సీటు నుంచి సభ్యులు తోసేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -