వీడి అసాద్యం కూల… ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. వయసెంతో తెలుసా?

- Advertisement -

ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంత మంది కేటుగాళ్లు చేస్తున్న పనులు బయట పడటంతో అందరూ షాక్ తింటున్నారు. ఓ 22 కుర్రాడు ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచి.. చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ నిత్య పెళ్లికొడుకు పేరు గణేష్.. ఉంటుంది చెన్నై. అయితే 12వ భార్య ఇతని నిజ స్వరూపాన్ని కనుక్కొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ నిత్య పెళ్లికొడుకు తన ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలకు వల వేస్తూ వారికి మాయమాటలు చెబుతూ.. పెళ్లి చేసుకోవడం ఎంజాయ్ చేసిన తర్వాత వదిలేయడం పరిపాటయ్యంది.

తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్న గణేశ్, ఆమెను పెళ్లాడతానని చెప్పాడు. అమ్మాయి తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించలేదు. ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కాకపోతే ఇద్దరూ మేజర్లు కావడంతో ఆమెను తన ట్రాప్ లో పడేసి పెళ్లి చేసుకున్నాడు.

- Advertisement -

కొంతకాలం తరువాత గణేశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య ఆరా తీసి, తనకన్నా ముందు అతనికి 11 పెళ్లిళ్లు జరిగాయని తెలుసుకుని షాక్ నకు గురైంది. 11 మందిని అతను మోసం చేశాడని, తాను 12వ దాన్నని తెలుసుకుని, పోలీసులను ఆశ్రయించింది.  పూర్తి విచారణ తర్వాత పోలీసులు ఇతగాడి మాయలు చూసి ఆశ్చర్యపోయారు.. చివరికి గణేశ్ ను అరెస్ట్ చేసి, కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News